ఆ ముగ్గురికీ షాక్‌: శ్రీలంక కొత్త కెప్టెన్‌ అతడే!

13 May, 2021 08:11 IST|Sakshi

కొలంబో: ఈ నెలాఖరులో బంగ్లాదేశ్‌లో పర్యటించి మూడు వన్డేల సిరీస్‌ ఆడనున్న శ్రీలంక జట్టును సెలక్టర్లు ప్రకటించారు. వికెట్‌ కీపర్‌ కుశాల్‌ పెరీరాను కొత్త కెప్టెన్‌గా నియమించారు. పెరీరా ఇప్పటివరకు 101 వన్డేలు, 22 టెస్టులు, 47 టి20 మ్యాచ్‌ల్లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో కెప్టెన్‌గా ఉన్న కరుణరత్నేతోపాటు సీనియర్‌ ఆల్‌రౌండర్‌ ఎంజెలో మాథ్యూస్, మాజీ కెప్టెన్‌ దినేశ్‌ చండీమల్‌లపై సెలెక్టర్లు వేటు వేశారు. 

మరోవైపు దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతో జూలై లో భారత్‌... శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. జూలై 13, 16, 19 తేదీల్లో వన్డేలు... జూలై 22, 24, 27 తేదీల్లో టి20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. హంబన్‌టోట, దంబుల్లాలను వేదికలుగా పరిశీలిస్తున్నారు. 2018 నిదాహస్‌ ట్రోఫీ తర్వాత భారత జట్టు శ్రీలంకలో ఆడలేదు.

చదవండి: మమ్మల్ని చూసే ద్రవిడ్‌ అలా...


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు