Lahiru Kumara: టెస్టు చరిత్రలో లంక తరపున అత్యంత చెత్త రికార్డు

19 Mar, 2023 11:42 IST|Sakshi

శ్రీలంక బౌలర్‌ లాహిరు కుమారా టెస్టు క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. లంక తరపున టెస్టు క్రికెట్‌లో చెత్త బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన జాబితాలో లాహిరు కుమారా తొలిస్థానంలో నిలిచాడు. అదే సమయంలో ఎకానమి పరంగా అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో లాహిరు కుమారా 25 ఓవర్లు బౌలింగ్‌ వేసి 164 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఇంతకముందు కాసున్‌ రజిత ఇదే న్యూజిలాండ్‌పై 34 ఓవర్లలో 144 పరుగలిచ్చి ఒక్క వికెట్‌ తీయకపోవడం అనేది అత్యంత చెత్త రికార్డుగా ఉంది. తాజాగా లాహిరు కుమారా దానిని సవరించాడు. లాహిరు, కాసున్‌ రజిత తర్వాత ఆశోక డిసల్వా 56 ఓవర్లలో 141 పరుగులు(1991, న్యూజిలాండ్‌పై వెల్లింగ్టన్‌ వేదికగా), మురళీధరన్‌ 46 ఓవర్లలో 137 పరుగులు(1997లో భారత్‌పై నాగ్‌పూర్‌ వేదికగా) ఉన్నారు.

టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన క్రికెటర్ల జాబితా ఇదే
► ఖాన్ మొహమ్మద్-(54-5-259-0) వర్సెస్‌ వెస్టిండీస్‌, 1958
► నిక్కీ బోజే-(65-5-221-0) వర్సెస్‌ శ్రీలంక, 2006
► యాసిర్ షా-(32-1-197-0) వర్సెస్‌ ఆస్ట్రేలియా, 2019
► రే ప్రైస్-(42-2-192-0) వర్సెస్‌ సౌతాఫ్రికా, 2001
► ప్రసన్న-(59-8-187-0) వర్సెస్‌ ఇంగ్లండ్‌ , 1967
► రే ప్రైస్-(36-5-187-0) వర్సెస్‌ ఆస్ట్రేలియా , 2003

ఎకానమీ పరంగా టెస్టు క్రికెట్‌లో అత్యంత చెత్త బౌలింగ్‌ గణాంకాలు
► జాహిద్‌ మహ్మద్‌( 33-1-235-4, ఎకానమీ 7.12) వర్సెస్‌ ఇంగ్లండ్‌, 2022
► లాహిరు కుమారా(25-1-164-0, ఎకానమీ 6.56) వర్సెస్‌ న్యూజిలాండ్‌, 2023
► యాసిర్‌ షా(32-1-197-0, ఎకానమీ 6.15) వర్సెస్‌ ఆస్ట్రేలియా, 2019

చదవండి: క్లబ్‌ మేనేజర్‌తో గొడవ..  పీఎస్‌జీని వీడనున్నాడా?

వయసు పెరిగినా వన్నె తగ్గలేదు..

మరిన్ని వార్తలు