Lalit Modi- Sushmita Sen: తనకంటే తొమ్మిదేళ్లు పెద్దది.. మినాల్‌ను పెళ్లాడేందుకు లలిత్‌ ఫైట్‌! చివరికి ఇలా!

16 Jul, 2022 13:01 IST|Sakshi

Lalit Modi Love Story With Minal: లలిత్‌ కుమార్‌ మోదీ.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను సృష్టించాడు. 

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు ఉన్నా ఐపీఎల్ విజయవంతం కావడంలో లలిత్‌ మోదీదే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్‌ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన లలిత్‌ మోదీ.. ఒకప్పుడు ప్రపంచంలోని వంద శక్తిమంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించడం విశేషం.

అయితే, ఎంత వేగంగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నాడో అదే తరహాలో పాతాళానికి దిగజారిపోయాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయన లండన్‌లో తలదాచుకుంటున్నాడు. 

మాజీ విశ్వసుందరితో ప్రేమాయణం!
ఇక ఇన్నాళ్లూ పెద్దగా లైమ్‌లైట్‌లో లేని 58 ఏళ్ల లలిత్‌ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్‌ అంటూ ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారాడు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేస్తూ బెటర్‌ పార్ట్‌నర్‌ అంటూ చర్చకు తెరలేపాడు. 


PC: lalit modi Instagram

ఈ క్రమంలో వీళ్లిద్దరి పెళ్లి అయి పోయిందని నెటిజన్లు ఫిక్సైపోగా అలాంటిదేమీ లేదని సుస్మిత, లలిత్‌ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నామని సోషల్‌ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కాగా 46 ఏళ్ల సుస్మితాసేన్‌ ఇప్పటికే ఎంతో మందితో డేటింగ్‌ చేసింది. 

సుస్మిత రూటు సెపరేటు!
స్థాయి.. వయసుతో సంబంధం లేకుండా తన కంటే చిన్నవాళ్లూ, పెద్దవాళ్లతోనూ ప్రణయ బంధం కొనసాగించింది సుస్మిత. కానీ ఎవ్వరికీ తనను వివాహం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. స్వేచ్ఛాయుత జీవనం గడపడానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం లలిత్‌తో ప్రేమ వ్యవహారం కూడా అలాంటిదేనా.. లేదంటే పెళ్లిదాకా వెళ్తారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.


PC: lalit modi Instagram

కాగా సుస్మిత ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇక లలిత్‌తో సుస్మిత పరిచయం ఈనాటిది కాదు. లలిత్‌ మోదీ దివంగత భార్య మినాల్‌ మోదీకి కూడా ఆమె ఫ్రెండ్‌ కావడం విశేషం. వీళ్లు ముగ్గురూ కలిసి ఐపీఎల్‌ మ్యాచ్‌లు వీక్షించేవారట.

ఇంతకీ మినాల్‌ ఎవరు?
మినాల్‌ సంగ్రాణి నైజీరియాకు చెందిన సింధీ హిందూ వ్యాపారవేత్త పెసూ అస్వాని కుమార్తె. లలిత్‌ మోదీతో స్నేహానికి కంటే ముందే ఆమెకు వివాహమైంది. వ్యాపారవేత్త జాక్‌ సాంగ్రాణిని ఆమె పెళ్లాడింది. వారికి కూతురు సంతానం. అయితే, జాక్‌ ఓ స్కామ్‌లో ఇరుక్కోవడంతో జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది.


PC: lalit modi Instagram

లలిత్‌ కంటే తొమ్మిదేళ్లు పెద్ద!
భర్తకు విడాకులిచ్చిన మినాల్‌తో ప్రేమలో పడ్డ లలిత్‌ మోదీ ఆమెను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. అయితే, మోదీ కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. ఆమె డివోర్సీ కావడం ఒక అభ్యంతరమైతే.. లలిత్‌ కంటే మినాల్‌ వయసులో దాదాపు తొమ్మిదేళ్లు పెద్దది కావడం మరో కారణం. 

కుటుంబాన్ని ఎదిరించి!
అయినా, అతడు ఆమె చేయిని వీడలేదు. కుటుంబంతో విభేదించాడు. 1991లో మినాల్‌ను పెళ్లిచేసుకున్నాడు. దీంతో తన ఫ్యామిలీకి దూరమయ్యాడు. తమను అందరూ దూరం పెట్టడంతో ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే లలిత్‌- మినాల్‌లకు ఇద్దరు సంతానం.


PC: lalit modi Instagram

కొడుకు రుచిర్‌, కూతురు అలియా ఉంది. వీరితో పాటు మినాల్‌ మొదటి కూతురు కరిమా సంగ్రాణిని కూడా చేరదీశాడని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా క్యాన్సర్‌ బారిన పడ్డ మినాల్‌ ఆఖరి వరకు వ్యాధితో పోరాడి 64 ఏళ్ల వయస్సులో 2018లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్‌ మోదీ సుస్మితతో ప్రేమాయణంతో అటు క్రీడా, ఇటు సినీ వర్గాల్లో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారాడు.

చదవండి: Ire Vs NZ 3rd ODI: మొన్న టీమిండియాను.. ఇప్పుడు న్యూజిలాండ్‌ను వణికించారు! వరుస సెంచరీలతో..
Ind Vs Eng 2nd ODI: తప్పంతా వాళ్లదే.. అందుకే భారీ మూల్యం.. మైండ్‌సెట్‌ మారాలి! మూడో వన్డేలో గనుక ఓడితే..

మరిన్ని వార్తలు