ఇలాంటి బౌలింగ్‌ అరుదు.. దిగ్గజ ఆటగాడు గుర్తురావడం పక్కా!

12 May, 2022 13:46 IST|Sakshi

లంకాషైర్‌ లెగ్‌ స్పిన్నర్‌ మాట్‌ పార్కిన్‌సన్‌ కౌంటీ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌లో అద్బుత బంతితో మెరిశాడు. కౌంటీలో భాగంగా లంకాషైర్‌, వార్విక్‌షైర్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో వార్విక్‌షైర్‌ రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి బ్యాటర్‌ లెగ్‌స్టంప్‌ అవతల బంతిని వేశాడు. దానిని డిఫెన్స్‌ ఆడే ప్రయత్నంలో బ్యాటర్‌ క్రీజు నుంచి ముందుకు వచ్చాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్‌ తీసుకొని ఆఫ్‌ స్టంప్‌ వికెట్‌ను పడగొట్టింది.

పార్కిన్‌సన్‌ ఇలాంటి బంతి వేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు 2021లో నార్త్‌ హంప్‌షైర్‌ కెప్టెన్‌ ఆడమ్‌ రోసింగ్‌టన్‌ను అచ్చం ఇలాంటి బంతితోనే బోల్తా కొట్టించాడు. ఇంకో విషయం ఏంటంటే.. వార్నర్‌ బాల్‌ ఆఫ్‌ ది సెంచరీని గుర్తు చేస్తూ పార్కిన్‌సన్‌ సెలబ్రేషన్స్‌ చేయడం వైరల్‌గా మారింది. పార్కిన్‌సన్‌ ఇంగ్లండ్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు.

ఇక షేన్‌ వార్న్‌ ఇంగ్లండ్‌ బ్యాటర్‌ మైక్‌ గాటింగ్‌ను ఔట్‌ చేసిన తీరు క్రికెట్‌ చరిత్రలో బాల్‌ ఆఫ్‌ ది సెంచరీగా మిగిలిపోయింది. ఇక ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ ఈ ఏడాది మార్చిలో థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

చదవండి: Sri Lanka Economic Crisis: దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది : లంక మాజీ క్రికెటర్లు

Lionel Messi: అర్జెంటీనా స్టార్‌ మెస్సీ కొత్త చరిత్ర.. 61 వ స్థానంలో కోహ్లి

మరిన్ని వార్తలు