Lasith Malinga: అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికిన యార్కర్‌ కింగ్‌

14 Sep, 2021 18:52 IST|Sakshi

Lasith Malinga Retirement From All Forms of Cricket: శ్రీలంక యార్కర్‌ కింగ్‌  ల‌సిత్ మలింగ  అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్టు ఫార్మట్‌ల నుంచి ఇదివరకే మలింగ తప్పుకున్నాడు. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి మలింగ పూర్తిగా తప్పుకున్నట్లు అయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా మంగళవారం పేర్కొన్నాడు.  ‘ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైనది. నన్ను ప్రోత్సహించిన వారందరికి ధన్యవాదాలు. నా అనుభవాన్ని యువ క్రికెటర్లతో పంచుకుంటా‘అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు . కాగా 2019లో వన్డేలనుంచి తప్పుకోగా, 2011లో టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

రికార్డుల మలింగా..
అంతర్జాతీయ క్రికెట్లో ఐదు హ్యాట్రిక్ లు నమోదు చేసి అరుదైన ఘనత సాధించిన  బౌలర్ కూడా మలింగానే. వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లను రెండుసార్లు పడగొట్టిన రికార్డు కూడా మలింగ పేరిటే నమోదై ఉంది. ఐపీఎల్ లో మలింగ ఇప్పటికీ అత్యధిక వికెట్ల తీసిన ఆటగాడుగా కొనసాగుతున్నాడు. శ్రీలంక తరుపున  84 టీ20 మ్యాచ్ లు ఆడిన మలింగా  107 వికెట్లు పడగొట్టాడు. 228 వన్డేల్లో 338 వికెట్లు తీసిన మలింగ, 30 టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కేరిర్‌లో 546  వికెట్లు సాధించాడు. అంతేకాదు122 ఐపీఎల్‌ మ్యాచ్‌ లు కూడా  లసిత్‌ మలింగ ఆడాడు. మలింగ కెప్టెన్సీలో శ్రీలంక జట్టు 2014లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది.

చదవండిT20 World Cup 2021: ఇలాగే చేస్తే అతడు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు...
 

మరిన్ని వార్తలు