Pele Old Goals Video: పీలే టాప్‌-10 స్టన్నింగ్‌ గోల్స్‌పై లుక్కేయాల్సిందే

30 Dec, 2022 20:04 IST|Sakshi

బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే(82) ఇకలేరు. అభిమానులను విషాదంలోకి నెట్టి తాను దివికేగారు. ‘‘నాకేం కాలేదని.. త్వరలోనే తిరిగి వస్తా’’నంటూ కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రకటించిన పీలే.. గురువారం అర్ధరాత్రి తర్వాత కానరాని లోకాలకు వెళ్లిపోయారు. పెద్ద పేగు కాన్సర్‌కు బలైపోయిన ఈ లెజెండ్‌ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మూడుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించారు. 1958, 1962, 1970లలో బ్రెజిల్‌ ప్రపంచకప్‌ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్‌ ముఖచిత్రంగా మారారు.  పీలే త‌న అటాకింగ్ స్కిల్స్‌తో ఫిఫా ప్ర‌పంచాన్ని ఊపేశారు. త‌న డ్రిబ్లింగ్ ట్యాలెంట్‌తో ప్ర‌త్య‌ర్థుల్ని బోల్తా కొట్టించేవాడు. గోల్ పోస్టునే టార్గెట్ చేస్తూ ముప్పుతిప్ప‌లు పెట్టేవాడు. ఇక ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచుల్లో పీలే మొత్తం 12 గోల్స్ చేశాడు. పీలే కొట్టిన టాప్‌-10 అద్భుత‌మైన గోల్స్‌ను ఒకసారి చూసేయండి.

►17 ఏళ్ల వ‌య‌సులో పీలే ఓ వండ‌ర్ చేశాడు. 1958లో బ్రెజిల్‌కు ఫిఫా వ‌రల్డ్‌క‌ప్‌ను అందించాడు. ఆ టైటిల్‌తో ఆగ‌లేద‌త‌ను. పీలేలో ఉన్న గోల్ స్కోరింగ్ సామ‌ర్థ్యం అంద‌ర్నీ స్ట‌న్ చేసేది. ఆ ఏడాది ఫ్రాన్స్‌తో జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌లో అత‌ను హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు.

► 1970వ సంవ‌త్స‌రం పీలే కెరీర్‌లో ఓ మలుపురాయి లాంటింది. ఆ ఏడాది ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను క‌ల‌ర్‌లో టెలికాస్ట్ చేశారు. కొత్త టెక్నాల‌జీతో మ్యాచ్‌ల‌ను ప్రేక్ష‌కులు వీక్షించారు. ఇక ఆ పీలే జోరును కూడా ప్రేక్ష‌కులు క‌ళ్లార్ప‌కుండా చూశారు. యెల్లో జెర్సీలో పీలే చేసిన విన్యాసాలు అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాయి. ఆ టోర్నీలో ఇట‌లీతో జ‌రిగిన ఫైన‌ల్లో బ్రెజిల్ 4-1 తేడాతో నెగ్గింది. ఆ విజ‌యంలో పీలే కీల‌క పాత్ర పోషించాడు. 

► 1982లో బ్రెజిల్ మ‌ళ్లీ టైటిల్‌ను గెలుచుకున్నది. ఆ జ‌ట్టులో పీలే ఉన్నాడు. కానీ ఆ టోర్నీలో అత‌ను కేవ‌లం రెండు మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడాడు. గాయం వ‌ల్ల టోర్నీలోని మిగితా మ్యాచ్‌ల‌కు దూరంగా ఉన్నాడు. 1966 టోర్నీలో బ్రెజిల్ గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయ్యింది.

చదవండి: అసమాన ఆటతీరుకు సలాం.. చెక్కుచెదరని రికార్డులకు గులాం

'పీలే'.. ఆ పేరు ఎలా వచ్చింది; అసలు పేరేంటి?

Pele: తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నవేళ

మరిన్ని వార్తలు