మనకు పనిభారం అధికంగా ఉన్నట్లు అనిపిస్తే..: కోహ్లి

7 Sep, 2020 09:53 IST|Sakshi

షార్జా: ఈ సీజన్‌లో ఎలాగైనా టైటిల్‌ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆ మేరకు తన ప్రయత్నాల్ని ప్రారంభించింది. అనవసర ఒత్తిడి తగ్గించుకొని ప్రాక్టీస్‌లో శ్రమించాలని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన జట్టుకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ యాజమాన్యం ట్విట్టర్‌లో పంచుకుంది. ‘మనకు పనిభారం అధికంగా ఉన్నట్లు అనిపిస్తే దాన్ని తగ్గించుకునేందుకు ఏదో ఒకటి చేయొచ్చు. (చదవండి: రైనాకు ఏదైనా జరగకూడనిది జరిగితే..!)

కానీ మనం తక్కువ సమయం శ్రమిస్తున్నప్పుడు అందులో తీవ్రత ఉండేలా చూసుకోవాలి. మీరు  రెండు లేదా రెండున్నర గంటలు మైదానంలో పరుగెత్తడం, ఆపై అలసిపోవడం నాకిష్టం లేదు. ఈ శ్రమను కాస్త తగ్గించుకొని ప్రాక్టీస్‌లో మీ పూర్తి సామర్థ్యాల్ని వినియోగించండి. నాణ్యమైన ప్రాక్టీస్‌ సెషన్స్‌ను చూడాలని నేను అనుకుంటున్నా’ అని కోహ్లి తన జట్టును ఉద్దేశించి అన్నాడు.(చదవండి: శానిటైజర్‌ను ఇలా కూడా వాడొచ్చా!)

>
మరిన్ని వార్తలు