గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణ హత్య చేసిన ఫుట్‌బాలర్‌

10 Jun, 2022 16:00 IST|Sakshi

లిబేరియా ఫుట్‌బాలర్‌ మహమ్మద్ అగోగో బారీ తన గర్ల్‌ఫ్రెండ్‌ను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం(జూన్‌ 6న) లిబేరియాలోని మోంట్సెరాడో కౌంటీ టౌన్‌లో జరిగినప్పటికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న బారీ తన ప్రియురాలి హత్య చేయడం వెనుక ఉన్న కారణాన్ని ఒక లెటర్‌ ద్వారా రివీల్‌ చేశాడు. తాను ఎంతగానో ప్రేమించిన లైమాస్(బారీ గర్ల్‌ఫ్రెండ్‌) వేరొకరితో సంబంధం పెట్టుకోవడం వల్లే హత్య చేసినట్లు లెటర్‌లో పేర్కొన్నాడు.

'నా కుటుంబసభ్యులు, మిత్రులు చాలాసార్లు లైమాస్‌ విషయంలో హెచ్చరించినప్పటికి ఖాతరు చేయలేదు.ప్రాణం కన్నా ఎక్కువగా లైమాస్‌ను ప్రేమించాను. తాను మాత్రం వేరొకరితో అక్రమం సంబంధం పెట్టుకొని నన్ను దారుణంగా మోసం చేసింది. నా కెరీర్‌ను, జీవితాన్ని సర్వ నాశనం చేసింది. అందుకే ఆమెను చంపి నా ప్రేమను సమాధి చేశాను. మీ మాట వినకుండా లైమాస్‌ను ప్రేమించి తప్పు చేసినందుకు క్షమించండి. నా జీవితంలో అన్ని కోల్పోయాను.'అంటూ పేర్కొన్నాడు. 

కాగా గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన అగోగో బారీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం లైమాస్‌ అంకుల్‌ గదిలోకి వచ్చి చూడగా ఆమె అప్పటికే  విగతజీవిగా పడి ఉంది. కాగా ఆమె బాడీపై బారీ రాసిన లెటర్‌ కనిపించింది. లైమాస్‌ అంకుల్‌ ఆ లెటర్‌ చదివి తన కోడలిని హత్య చేసిందని బారీ అని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు రంగప్రవేశం చేసి లైమాస్‌ శరీరాన్ని పోస్టమార్టంకు తరలించారు. ఇక అగోగో బారీని పోలీసులు గురువారం అర్థరాత్రి అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేశారు.

చదవండి: 'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'.. జాతీయ కోచ్‌పై భారత మహిళా సైక్లిస్ట్‌ ఆరోపణలు

మరిన్ని వార్తలు