చంపేస్తానంటూ హెచ్చరిక.. ఆటగాడిపై జీవితకాల నిషేధం

17 Dec, 2021 08:30 IST|Sakshi

 క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజం. ఒక్కోసారి అవి కొట్టుకునే స్థాయికి వెళ్తాయి. అయితే ఇలాంటివి జరగకుండా అంపైర్లు జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దుమణిగిస్తుంటారు. మరి అలాంటి అంపైర్లకు చంపేస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తే ఆటగాళ్లపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. సరిగ్గా అలాంటి పనే పావర్టీ బే క్రికెట్‌ అసోసియేషన్‌ చేసింది.

చదవండి: Virat Kohli: 'కోహ్లి వివాదం ముగించే వ్యక్తి గంగూలీ మాత్రమే'

మ్యాచ్‌ జరుగుతున్న సమయంలోనే అంపైర్‌పై చేయి చేసుకోవడంతో పాటు చంపేస్తానంటూ తిమోటి వీర్ అనే క్లబ్‌ క్రికెటర్‌ గ్రౌండ్‌లోనే వార్నింగ్‌ ఇచ్చాడు. డిసెంబర్‌ 4న గిస్‌బోర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. దీనిపై విచారణ జరిపిన పావర్టీ బే క్రికెట్‌ అసోసియేషన్‌ తిమోటిపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంది. క్రికెట్‌ నిబంధనల ప్రకారం అంపైర్‌పై దురుసు ప్రవర్తన మాత్రమేగాక చంపేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసి కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద లెవెల్‌-4 నిబంధనలను తిమోటి అతిక్రమించినట్లు తేలింది.

ఈ చర్యలకుగాను ఇకపై క్రికెట్‌ ఆడకుండా అతనిపై జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇంతకముందు కూడా తిమోటి ఇదే తరహాలో తన దురుసు ప్రవర్తనతో కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ నిబంధనలు ఉల్లఘించాడని.. అందుకే తాజా చర్యను సీరియస్‌గా తీసుకొని జీవితకాలం నిషేధం విధించినట్లు పావర్టీ బే క్రికెట్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ ఐసాక్‌ హ్యూగ్స్‌ వివరణ ఇచ్చారు.

చదవండి: Ashes 2021-22: జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. సూపర్‌మాన్‌లా డైవ్‌ చేస్తూ.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు