Lionel Messi: 'అలా ప్రవర్తించడం తప్పే.. నేను చేసింది నాకే నచ్చలేదు'

31 Jan, 2023 12:46 IST|Sakshi

అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ తన కెరీర్‌లో లోటుగా ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ను గతేడాది అందుకున్న సంగతి తెలిసిందే. నాలుగుసార్లు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందుకోవడంలో విఫలమైన మెస్సీ ఐదో ప్రయత్నంలో మాత్రం సక్సెస్‌ అయ్యాడు. జట్టును అంతా తానై నడిపించిన మెస్సీ.. కీలకమైన ఫైనల్లో ఫ్రాన్స్‌పై షూటౌట్‌ ద్వారా విజేతగా నిలిపాడు. ఫైనల్లో మూడు గోల్స్‌ చేసి విజయంలో కీలకపాత్ర పోషించిన మెస్సీ టోర్నీలో మొత్తంగా ఏడు గోల్స్‌ కొట్టి గోల్డెన్‌ బాల్‌ అవార్డును గెలుచుకున్నాడు.

ఇదిలా ఉంటే వరల్డ్‌ కప్‌ ముగిసిన 45రోజులు కావొస్తున్న వేళ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌లో జరిగిన ఒక సంఘటనపై స్పందించాడు. అదేంటంటే.. నెదర్లాండ్స్‌తో క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా డచ్‌ బాస్‌ లూయిస్‌ వాన్‌గాల్‌తో పాటు స్ట్రైకర్‌ వౌట్‌ వెగ్రోస్ట్‌లను హేళన చేస్తున్నట్లుగా తన రెండు చేతులను చెవుల మధ్య పెట్టి కోపంగా చూస్తూ ఫోజివ్వడం సంచలనం కలిగించింది. సౌమ్య హృదయడనుకున్న మెస్సీ నుంచి ఇలాంటి ఎక్స్‌ప్రెషన్‌ వస్తుందని ఎవరు ఊహించలేదు. అందుకే మెస్సీని కొంతమంది తప్పుబట్టారు.

అప్పుడే దీనిపై స్పందించిన మెస్సీ..''గేమ్‌లో భాగంగా కంట్రోల్‌ తప్పాను..  ఆ సమయంలో అలా వచ్చేసింది'' అంటూ వివరణ ఇచ్చాడు. తాజాగా మరోసారి ఇదే అంశంపై స్పందిస్తూ మరింత క్లారిటీ ఇచ్చాడు. ''నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అలా ప్రవర్తించడం తప్పే. నేను చేసింది నాకే నచ్చలేదు. అయితే దానిని మనసులో పెట్టుకొని ముందుకెళ్లడం నాకు సాధ్యం కాదు. అందుకే ఆరోజే ఏదో అనుకోకుండా జరిగిందని వివరణ ఇచ్చకున్నాడు. మ్యాచ్‌ అన్నాకా హైటెన్షన్‌ ఉండడం సహాజం. ఆ టెన్షన్‌లో ఒక్కోసారి మనం సహనం కోల్పోతాం. నాకు కూడా అదే జరిగింది. ఇక నేను అందుకున్న ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని దిగ్గజం మారడోనా చెంతకు చేర్చాను'' అంటూ వెల్లడించాడు. 

చదవండి: విషాదం: ప్రపంచ ఛాంపియన్‌.. మంచు కింద సజీవ సమాధి

మరిన్ని వార్తలు