CWG 2022: కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఓటమి.. ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌ సంచలన నిర్ణయం!

9 Aug, 2022 19:35 IST|Sakshi

ఇంగ్లండ్‌ మహిళల జట్టు ప్రధాన కోచ్ లీసా కీట్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఇంగ్లండ్‌ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన హెడ్‌కోచ్‌ పదవికి కీట్లీ రాజీనామా చేయాలని నిర్ణయించుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ అద్భుతంగా ఆడినప్పటికీ.. సెమీఫైనల్లో భారత్‌ చేతిలో అనూహ్యంగా ఓటమి చెందింది.

అదే విధంగా న్యూజిలాండ్‌తో జరిగిన కాంస్య పతక పోరులోనూ ఇంగ్లండ్‌ ఘోర పరాజయం పాలైంది. దీంతో స్వదేశంలో కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పటికీ క్రికెట్‌ విభాగంలో పతకం సాధించకుండానే ఇంగ్లండ్‌ తమ ప్రయాణాన్ని ముగించింది. కాగా కీట్లీ రెండున్నరేళ్ల పాటు ఇంగ్లండ్‌ జట్టుకు కోచ్‌గా పనిచేసింది.

ఆమె నేతృత్వంలో ఇంగ్లండ్‌ జట్టు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా మహిళల ప్రపంచ కప్‌-2022లో ఇంగ్లండ్‌ ఫైనల్‌కు చేరడంలో ఆమె కీలక పాత్ర పోషిచింది. ఇక కీట్లీకు కోచ్‌గా సెప్టెంబర్‌లో జరగనున్న ఇంగ్లండ్‌- భారత్‌ సిరీస్‌ అఖరిది కానుంది. ఈ సిరీస్‌ తర్వాత ఆమె తన బాధ్యతలనుంచి తప్పుకోనుంది.
చదవండిభారత్‌పై చెత్త రికార్డుకు కారణం మా జట్టు అత్యుత్సాహమే: పాక్‌ క్రికెటర్‌

మరిన్ని వార్తలు