Aleksandr Sorokin: సరికొత్త ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 319 కిలో మీటర్లు 

20 Sep, 2022 13:40 IST|Sakshi

అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఇట‌లీలోని వెరోనాలో మంగళవారం జ‌రిగిన యురోపియ‌న్ ఛాంపియ‌న్‌షిప్‌లో లిథువేనియాకు చెందిన 41 ఏళ్ల అలెగ్జాండ‌ర్ సోరోకిన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. 24 గంట‌ల్లో సోరోకిన్‌ 319.614 కిలోమీట‌ర్ల దూరం పరిగెత్తి ప్రపంచ రికార్డు లిఖించాడు. కాగా అలెగ్జాండర్‌ స‌గ‌టున ఒక కిలోమీట‌ర్ దూరాన్ని 4.30 నిమిషాల్లో దాటేశాడు.ఇంతకముందు అత‌ని పేరిటే ఉన్న రికార్డుపే సోరోకిన్ బద్దలు కొట్టడం విశేషం.

గ‌తేడాది ఆగ‌స్టులో 24 గంట‌ల్లో అత‌ను 303.506 కిలోమీట‌ర్ల  దూరాన్ని ప‌రుగెత్తాడు. తాజా రికార్డుపై 40 ఏళ్ల సోరోకిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు. ''చాలా అలిసిపోయా.. కానీ రికార్డుతో డబుల్‌ ఆనందంతో ఉన్నా. విషయమేంటనేది అర్థమయిందిగా.. ప్రపంచ రికార్డు కొట్టడం ఒక ఎత్తయితే.. నా రికార్డును నేనే బద్దలు కొట్టడం మరింత సంతోషాన్నిచ్చింది.'' అంటూ తెలిపాడు.

ఇక పొలాండ్‌కు చెందిన అథ్లెట్‌ పియోట్రోస్కీ 24 గంట‌ల్లో 301.858 కిలోమీట‌ర్ల దూరం పరిగెత్తి రెండో స్థానంలో నిలవగా.. ఇట‌లీకి చెందిన మార్కో విసినిటీ 288 కిలోమీట‌ర్ల దూరం ప‌రిగెత్తి మూడో స్థానంలో నిలిచాడు.

A post shared by Aleksandr Sorokin (@ultrarunner_aleksandr_sorokin)


చదవండి: Karman Kaur: భారత నంబర్‌వన్‌గా కర్మన్‌ కౌర్‌ 

ICC New Rules: అక్టోబర్‌ ఒకటి నుంచి కొత్త రూల్స్‌.. టి20 ప్రపంచకప్‌లో తొలిసారిగా

మరిన్ని వార్తలు