ఆండ్రూ సైమండ్స్‌ కారు ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే..?

16 May, 2022 14:25 IST|Sakshi

Andrew Symonds: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ (46) శనివారం (మే 14) రాత్రి క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్న క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. కారు ప్రమాదంలో సైమండ్స్‌ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షి వేలాన్‌ టౌన్సన్‌ తెలిపాడు. ప్రమాద సమయంలో ఘటనా స్థలికి అతి సమీపంలో ఉన్న టౌన్సన్‌.. సైమండ్స్ ప్రాణాలు కాపాడేందుకు విశ్వ ప్రయాత్నాలు చేసినట్లు పోలీసులకు వివరించాడు.

సైమండ్స్‌ ప్రమాద ఘటనపై టౌన్సన్‌ స్పందిస్తూ.. నా కళ్ల ముందే కారు యాక్సిడెంట్‌కి గురైంది. అతివేగంతో ఉన్న సైమండ్స్ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. సైమండ్స్‌ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఇరుక్కుపోయిన సైమండ్స్‌ను కాపాడేందుకు సీపీఆర్ కూడా చేశాను. కానీ అప్పటికే అతని ప్రాణాలు విడిచాడు. 


ఆ సమయానికి ప్రమాదానికి గురైన వ్యక్తి సైమండ్స్ అని నాకు తెలీదు అని టౌన్సన్‌ చెప్పుకొచ్చాడు. ప్రమాద సమయంలో సైమండ్స్‌ కారులో రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయని, యాక్సిడెంట్‌లో ఆ రెంటికి ఎలాంటి అపాయం జరగలేదని పేర్కొన్నాడు. అందులో ఓ కుక్క సైమండ్స్‌ మృతదేహం వద్ద రోదిస్తూ.. అక్కడికి ఎవ్వరినీ రానివ్వలేదని పోలీసులు వివరించాడు.
చదవండి: ఆండ్రూ సైమండ్స్‌ గొప్ప ఆల్‌రౌండర్‌.. కానీ ఆ వివాదాల వల్లే..

మరిన్ని వార్తలు