T20 World Cup 2022: బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్న శాంసన్‌ ఫ్యాన్స్‌.. ఎప్పుడంటే?

15 Sep, 2022 14:16 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌కు-2022కు ఎంపిక చేసిన భారత జట్టులో వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌కు చోటుదక్కకపోవడంపై తన అభిమానులు ఇప్పటికీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ మెగా ఈవెంట్‌ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ శాంసన్‌కు మాత్రం భారత జట్టులో పెద్దగా చోటుదక్కడం లేదు.

2022లో సంజూ ఇప్పటి వరకు ఆరు వన్డేలు, ఆరు టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆరు టీ20లు ఆడిన శాంసన్‌ 179 పరుగులు సాధించాడు. ఇటీవల వెస్టిండీస్‌ పర్యటనలో సంజూ శాంసన్‌ రాణించాడు.  ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌కు శాంసన్‌ను తీసుకుంటారని అంతా భావించారు. అయితే కనీసం టీ20 ప్రపంచకప్‌కు స్టాండ్‌బైగా కూడా సంజూను ఎంపికచేయకపోవడంపై అభిమానులు మండిపడున్నారు.

ఈ క్రమంలో బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని అతడి ఫ్యాన్స్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తిరువనంతపురంలో సెప్టెంబర్‌ 28న భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న తొలి టీ20ను వేదికగా చేసుకున్నట్లు సమాచారం.  ఐఏఎన్‌ఎస్‌ న్యూస్‌ ఏజెన్సీ రిపోర్ట్‌ ప్రకారం.. తిరువనంతపురం వేదికగా జరగనున్న టీమిండియా- సాతాఫ్రికా తొలి టీ20 మ్యాచ్‌లో స్థానికులు సంజూ శాంసన్‌ ఫొటోలు ఉన్న టీషర్ట్స్‌ వేసుకొని వచ్చి నిరసన తెలపనున్నట్లు పేర్కొం‍ది.
చదవండి: నువ్వేమి చేశావు నేరం.. శాంసన్‌ను ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్‌ ఫైర్‌

>
మరిన్ని వార్తలు