IPL 2022: ఉమ్రాన్‌ మాలిక్‌ రికార్డును బద్దలు కొట్టిన ఫెర్గూసన్‌..

30 May, 2022 16:16 IST|Sakshi
pc: ipl.com

ఐపీఎల్‌-2022 ఛాంపియన్స్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో హార్ధిక్‌ సేన​ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ ఫైనల్‌ పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ లూకీ ఫెర్గూసన్‌ సరికొత్త రికార్డు సాధించాడు.

ఈ మ్యాచ్‌లో ఫెర్గూసన్‌ ఏకంగా గంటకు కు 157.3 కిలోమీటర్ల  వేగంతో బంతిని సంధించాడు. దీంతో ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన తొలి బౌలర్‌గా ఫెర్గూసన్‌  నిలిచాడు. అంతకుముందు ఎస్‌ఆర్‌హెచ్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ పేరిట ఉన్న ఫాస్టెస్ట్‌ డెలివరీ(157 .కి.మీ వేగం) రికార్డును ఫెర్గూసన్‌ బద్దలు కొట్టాడు.

చదవండి: Riyan Parag: 'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి'

మరిన్ని వార్తలు