మాల్దీవుల్లో ప్రేమ పక్షులు.. రొమాంటిక్‌ ఫోటోస్‌

25 Feb, 2021 20:32 IST|Sakshi

స్కూల్‌కు వెళ్లి స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ వేసుకున్నట్లు అందేంటో ఇటీవల సెలబ్రిటీలంతా మాల్దీవుల్లో వాలిపోతున్నారు. కొన్ని రోజులు షూటింగ్‌లకు సైడ్‌ ఇచ్చి మరీ వెకేషన్ కోసం బీచ్‌ తీరంలో సేదతీరేందుకు క్యూ కడుతున్నారు. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు ఇదే తంతు కొనసాగుతోంది. కత్రినా కైఫ్,‌‌ అలియా భట్‌, శిల్పాశెట్టి నుంచి నాగార్జున, సమంత, కాజల్‌, మంచు లక్ష్మీ, రకుల్‌ వరకు మాల్దీవుల్లో హాలీడే ట్రిప్‌లు ఎంజాయ్‌ చేసినవారే. తాజాగా ఈ జాబితాలోకి మరో లవ్‌ బర్డ్స్‌ చేరిపోయారు. బ్యాడ్మింటర్‌ స్టార్‌ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌ మాల్దీవుల్లో విహరిస్తున్నారు.

లవర్‌తో కలిసి దిగిన రొమాంటిక్‌ ఫోటోలను విశాల్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. వీటిని చూసిన అభిమానులు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. కాగా  బ్యాడ్మింటన్ బ్యూటీ, విష్ణు విశాల్‌  ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరద్దరికి ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యింది. కానీ ఇప్పటి వరకు పెళ్లి బాజాలు  మోగలేదు. దీంతో జ్వాల పెళ్లెప్పుడు అని ఆమె ఫ్యాన్స్.. స్పోర్ట్స్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు కెరీర్ పరంగా గుత్తా జ్వాల బ్యాడ్మింటన్‌ అకాడమీని ప్రారంభించగా.. విష్ణు విశాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

చదవండి: ప్రేయసికి నటుడి విషెస్; ‘ఇది బిగినింగ్‌ మాత్రమే’

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు