IPL 2022: ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడనివ్వలేదు.. అక్కడ మాత్రం దుమ్ము రేపాడు!

7 Jun, 2022 13:51 IST|Sakshi

నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను వెస్టిండీస్‌ 3-0తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో విండీస్‌ ఆల్‌రౌండర్‌ కైల్‌ మైర్స్‌ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు అతడికి కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది.

ఇక నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేలో మాత్రం మైర్స్‌ సెంచరీతో చెలరేగాడు. ఇది అతడి కెరీర్‌లో తొలి సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో 106 బంతులు ఎదర్కొన్న  మైర్స్‌ 120 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతడు 142 పరుగులతో పాటు మూడు వికెట్లు కూడా పడగొట్టాడు.

ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో మైర్స్‌ను రూ.50 లక్షలకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా  మైర్స్‌ అవకాశం దక్కలేదు. సీజన్‌ మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే తాజాగా అతడిని అభినందిస్తూ.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ట్వీట్‌ చేసింది.

ఇక లక్నో ట్వీట్‌పై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. "అతడు విధ్వంసకర ఆల్‌రౌండర్‌.. ఒక్క మ్యాచ్‌లోనైనా అవకాశం ఇ‍చ్చి ఉంటే బాగుండేది" అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అరంగేట్ర సీజన్‌లోనే లక్నో సూపర్‌ జెయింట్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2022-Harshal Patel: డెత్‌ ఓవర్లంటే చాలా భయం.. కానీ అదే నాకిష్టం

మరిన్ని వార్తలు