SL VS AUS 1st Test: ఐదేసిన లయన్‌.. లంకను కట్టడి చేసిన ఆసీస్‌

29 Jun, 2022 21:24 IST|Sakshi

Nathan Lyon: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంకను 212 పరుగులకే కట్టడి చేసింది. ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ (5/90) లంక పతనాన్ని శాశించగా, స్వెప్సన్‌ (3/55), స్టార్క్‌ (1/31), కమిన్స్‌ (1/25) తలో చేయి వేశారు. లంక ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్‌ నిరోషన్‌ డిక్వెల్లా (58) అర్ధసెంచరీతో రాణించగా మిగతా ఆటగాళ్లంతా ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు కరుణరత్నే (28), నిస్సంక (23), మాథ్యూస్‌ (39), ఆర్‌ మెండిస్‌ (22), ధనంజయ డిసిల్వా (14) రెండంకెల స్కోర్‌ చేశారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌కు..డేవిడ్‌ వార్నర్‌ (25), ఉస్మాన్‌ ఖ్వాజా (47 నాటౌట్‌) ఓ మోస్తరు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించాక వార్నర్‌ మెండిస్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా ఔటయ్యాడు. వార్నర్‌ పెవిలియన్‌కు చేరాక ఆసీస్‌ స్వల్ప వ్యవధిలో లబూషేన్‌ (13), స్టీవ్‌ స్మిత్‌ (6)ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఖ్వాజా, ట‍్రవిస్‌ హెడ్‌ (6) క్రీజ్లో ఉన్నారు. లంక బౌలర్లలో రమేశ్‌ మెండిస్‌ 2 వికెట్లు పడగొట్టగా, స్టీవ్‌ స్మిత్‌ రనౌటయ్యాడు. కాగా, లంక పర్యటనలో ఆసీస్‌ టీ20 సిరీస్‌ను (2-1) కైవసం చేసుకుని వన్డే సిరీస్‌ను (2-3) చేజార్చుకున్న విషయం తెలిసిందే. 
చదవండి: ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌కు టీమిండియా కెప్టెన్‌ ఎవరంటే..!?

మరిన్ని వార్తలు