IPL 2022: ఐపీఎల్‌లో మహ్మద్‌ సిరాజ్‌ చెత్త రికార్డు.. తొలి బౌలర్‌గా..!

27 May, 2022 22:32 IST|Sakshi
PC: IPL.com

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఓ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు ఇచ్చిన తొలి బౌలర్‌గా సిరాజ్‌ నిలిచాడు.

ఐపీఎల్‌-2022సీజన్‌లో 30 సిక్స్‌లు ఇచ్చిన సిరాజ్‌ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు 2018 సీజన్‌లో డ్వేన్‌ బ్రావో 29 సిక్స్‌లు సమర్పించుకున్నాడు.

చదవండి: IPL 2022: సెంచరీతో లక్నోకు చుక్కలు చూపించాడు.. ఎవరీ రజత్‌ పాటిదార్‌..?

మరిన్ని వార్తలు