రోహిత్ భాయ్ వల్లే ఐపీఎల్ ఎంట్రీ.. అంతా అతని చలువే

25 May, 2021 21:21 IST|Sakshi

ముంబై: టీమిండియా స్టార్ ఆటగాడు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వల్లే తాను ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చానని  టీమిండియా  స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. రోహిత్ శర్మతో బంధంపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన నేను.. రోహిత్ భాయ్ చొరవ వల్లే  ఐపీఎల్ అరంగేట్రం చేసానని వ్యాఖ్యానించాడు. రోహిత్ భాయ్ నా రూమ్​లోకి వచ్చి 'నువ్వు తర్వాతి మ్యాచ్​లు ఆడబోతున్నావ్' అని చెప్పిన మాటలు తానెప్పటికీ మర్చిపోలేనన్నాడు. ఇందుకు గాను తాను రోహిత్ భాయ్‌కి జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు.  

కాగా, అదే సీజన్‌లో తొలిసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న హిట్‌మ్యాన్.. సీనియర్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా జట్టులో ఉన్నా.. చహల్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు. అక్కడి నుంచి చహల్ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాతి సీజన్‌ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చాహల్.. అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుని టీమిండియాలో స్థానం సంపాదించాడు. చహల్ .. ప్రస్తుతం టీమిండియా రెగ్యులర్ సబ్యుడిగానే కాకుండా తన ఐపీఎల్ జట్టైన ఆర్‌సీబీకి కీలక బౌలర్‌గా ఉన్నాడు. కాగా, చహల్‌కు రోహిత్‌తో ఎంత అనుబంధముందో తన కెప్టెన్ విరాట్‌తో కూడా అంతే అనుబంధం ఉంది. 
చదవండి: వీడియో కాల్లో చూసి కోవిడ్ అని చెప్పేసింది..
 

>
మరిన్ని వార్తలు