డోపింగ్‌ టెస్ట్‌లో పట్టుబడ్డ మహిళా క్రికెటర్‌..

29 Jun, 2021 18:15 IST|Sakshi

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన దేశవాళీ మహిళా క్రికెటర్‌ అన్షులా రావ్‌ డోపింగ్‌ పరీక్షలో పట్టుబడింది. దీంతో ఆమెపై జాతీయ డోపింగ్‌ ఏజెన్సీ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. ఈ క్రమంలో డోపింగ్‌ బ్యాన్‌కు గురైన తొలి మహిళా క్రికెటర్‌గా అపకీర్తి మూటగట్టుకుంది. నిషేధిత ఉత్ప్రేరకం ‘19–నోరాండ్రోస్టెరాన్’ తీసుకున్నందుకు గాను ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది.

దోహా ప్రయోగాశాలలో నిర్వహించిన పరీక్షల్లో ఆమె మూత్ర నమూనాల్లో అనబాలిక్‌ ఆండ్రోజెనిక్‌ స్టెరాయిడ్‌ (ఏఏఎస్‌) ఉన్నట్లు తేలింది. అయితే అది తన శరీరంలోకి ఎలా వచ్చిందనే విషయమై ఆమె నోరు విప్పలేదు. కాగా, అన్షులా చివరిసారిగా 2019-20లో బీసీసీఐ నిర్వహించిన అండర్‌-23 టీ20 టోర్నీలో పాల్గొంది. నాడా పరిథిలోకి బీసీసీఐ వచ్చాక బయటపడిన తొలి కేసు ఇదే కావడం విశేషం.  
చదవండి: కోహ్లీ నాలుగేళ్ల సంపాదన ఒక్క ఫేక్‌ ఫైట్‌ ద్వారా ఆర్జించాడు

మరిన్ని వార్తలు