Ranji Trophy 2022: కొత్త చరిత్ర ఆవిష్కృతం.. రంజీ ట్రోఫీ విజేత మధ్యప్రదేశ్ 

26 Jun, 2022 15:03 IST|Sakshi

రంజీ ట్రోఫీ 2021-22 సీజన్‌ విజేతగా మధ్యప్రదేశ్‌  నిలిచింది. ముంబైతో జరిగిన ఫైనల్లో మధ్యప్రదేశ్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి రంజీ చాంపియన్‌గా అవతరించింది. 1998-99 రంజీ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన మధ్యప్రదేశ్‌ ఈసారి మాత్రం అవకాశం చేజారనివ్వలేదు. ముంబైతో జరిగిన ఫైనల్‌ పోరులో ఆధ్యంతం అధిపత్యం చెలాయిస్తూ విజేతగా నిలిచింది.

113/2 క్రితం రోజు స్కోరుతో ఐదోరోజు ఆటను ప్రారంభించిన ముంబై 269 పరుగులకు ఆలౌటైంది. సువేద్‌ పార్కర్‌ 51 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ 45, పృథ్వీ షా 44 పరుగులు చేశారు. మధ్యప్రదేశ్‌ బౌలర్‌ కుమార్‌ కార్తికేయ నాలుగు వికెట్లతో చెలరేగగా.. గౌరవ్‌ యాదవ్‌, పార్థ్‌ సహాని చెరో రెండు వికెట్లు తీశారు.


అనంతరం 108 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన మధ్యప్రదేశ్‌ వన్డే తరహా ఆటతీరును ప్రదర్శించింది. హిమాన్షు మాంత్రి 37 పరుగులు చేయగా, తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరోలు శుభమ్‌ శర్మ 30, రజత్‌ పాటిధార్‌ 30 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

చదవండి: రోహిత్‌ దూరమైతే!.. కోహ్లి లేదా పంత్‌ కాదనుకుంటే రహానే?

మరిన్ని వార్తలు