లైంగిక వేధింపుల కేసు.. స్టార్‌ ఫుట్‌బాలర్‌పై వేటు

27 Aug, 2021 08:25 IST|Sakshi

Benjamin Mendy.. ఫ్రాన్స్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌.. ప్రస్తుతం మాంచెస్టర్‌ సిటీ క్లబ్‌కు ఆడుతున్న అతనిపై సస్పెన్షన్‌ వేటు పడింది. మెండీపై వచ్చిన అత్యాచార ఆరోపణలు నిజమేనని పోలీసులు పేర్కొనడంతో ప్రీమియర్‌ లీగ్‌ చాంపియన్‌ అతన్ని మాంచెస్టర్‌ సిటీ క్లబ్‌ నుంచి సస్పెండ్‌ చేసింది.  27 ఏళ్ల మెండీపై నాలుగు అత్యాచారాలతో పాటు ఒక లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్లు ఫ్రాన్స్‌ ఇంటర్నేషనల్‌ కోర్టు స్పష్టం చేసింది.

మెండీపై ఫిర్యాదు చేసిన ముగ్గురి వయస్సు 16 ఏళ్లు అని.. అక్టోబర్‌ 2020 నుంచి ఆగస్టు 2021 మధ్య ఇది జరిగినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా మెండీపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కాగా నేడు(ఆగస్టు 27న) మెండీని చెస్టర్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచనున్నారు.

ఇక ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బెంజమిన్‌ మెండీ 2018లో ఫిఫా వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2017 నుంచి మాంచెస్టర్‌ సిటీ క్లబ్‌ తరపున ఆడుతున్న మెండీ మొత్తంగా 75 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. 

చదవండి: Mohammed Siraj: సిరాజ్‌ స్కోరెంత.. ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌

మరిన్ని వార్తలు