Mason Greenwood: ఫుట్‌బాల్‌ ఆటగాడి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. ఇక కష్టమే

1 Feb, 2022 16:48 IST|Sakshi

మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌ ఫుట్‌బాలర్‌ మాసన్‌ గ్రీన్‌వుడ్‌ మెడకు ఉచ్చు మరింత బిగుస్తుంది.సెక్స్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాసన్‌ గ్రీన్‌వుడ్‌ను గత ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు.  తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై బలవంతగా లైంగిక వేధింపులకు దిగినట్లు వచ్చిన వార్తలు నిజమా కాదా అనేది నిర్థారించాల్సి ఉంది. అయితే మాంచెస్టర్‌ యునైటెడ్‌ మొదట మాసన్‌ గ్రీన్‌వుడ్‌ విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు.

చదవండి: ఫుట్‌బాల్‌ ఆటగాడిపై ఆరోపణలు.. సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్‌

తాజాగా అతనిపై వచ్చిన సెక్స్‌ ఆరోపణలు నిజమేనని తెలియడంతో ఫుట్‌బాల్‌ క్లబ్‌ కూడా గ్రీన్‌వుడ్‌పై కఠిన చర్యలు తీసుకుంది. తక్షణమే గ్రీన్‌వుడ్‌ను క్లబ్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపింది. తన తప్పు లేదని నిరూపించుకునేవరకు గ్రీన్‌వుడ్‌ ఏ క్లబ్‌ తరపున ఫుట్‌బాల్‌ ఆడకుండా ఫుట్‌బాల్‌ సమాఖ్యకు సిఫార్సు చేసినట్లు పేర్కొంది. దీనికి తోడూ అన్ని ఎండార్స్‌మెంట్ల నుంచి గ్రీన్‌వుడ్‌ను తొలగిస్తున్నామంటూ తమ అధికారిక వెబ్‌సైట్‌లో అతని పేరు తొలగించిన పేజ్‌ను విడుదల చేసింది.


ఇక గ్రీన్‌వుడ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న నైక్‌ కంపెనీ తమ స్పాన్సర్‌సిప్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ''మాసన్‌ గ్రీన్‌వుడ్‌పై వస్తున్న ఆరోపణలు మమ్మల్ని ఆలోచనలో పడేశాయి. అందుకే తాత్కాలింకగా అతనితో స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసుకుంటున్నాం. పరిస్థితిని గమనిస్తున్నాం.'' అంటూ తెలిపింది. 

ఇక హారిట్‌ రాబ్‌సన్‌ అనే యువతి మాసన్‌ గ్రీన్‌వుడ్‌కు మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ అంటూ చెప్పుకుంటూ గత ఆదివారం కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది. తనతో శృంగారంలో పాల్గొనాలని చెప్పాడని.. మాట విననందుకు తన శరీర భాగాలపై దాడి చేశాడంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసింది. ఆ తర్వాత హారిట్‌- గ్రీన్‌వుడ్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపును కూడా రిలీజ్‌ చేయడం సంచలనం రేపింది.

మరిన్ని వార్తలు