లాస్కో (స్లొవేనియా): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) కంటెండర్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన మనిక బత్రా–అర్చన కామత్ జోడీ మహిళల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మనిక–అర్చన ద్వయం 11–6, 8–11, 11–6, 5–11, 11–8తో లియు వెషన్–యిది వాంగ్ (చైనా) జోడీపై గెలిచింది.
నేడు జరిగే ఫైనల్లో మెలానీ–అద్రియానా దియాజ్ (ప్యూర్టోరికో) జంటతో మనిక–అర్చన జోడీ తలపడుతుంది. సింగిల్స్ సెమీఫైనల్లో మనిక 2–4తో యిది వాంగ్ చేతిలో ఓడి కాంస్య పతకం సాధించింది.
చదవండి: T20 World Cup 2021: దురదృష్టం అంటే ఇదే..! మ్యాచ్ గెలిచినా సఫారీ జట్టు ఇంటికి.. ఎందుకంటే?