భారత పేస్‌ త్రయాన్ని పాక్‌ దిగ్గజాలతో పోల్చిన వివాదాస్పద వ్యాఖ్యాత

3 Jan, 2022 21:48 IST|Sakshi

Sanjay Manjrekar: ఇటీవలి కాలంలో టీమిండియా విదేశాల్లో అద్భుతంగా రాణించడానికి బుమ్రా, షమీ, సిరాజ్‌లే ప్రధాన కారణమని మాజీ ఆటగాడు, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. గత రెండు, మూడేళ్లలో ఓవర్సీస్‌లో టీమిండియా ప్రదర్శన చూస్తే అది ఇట్టే స్పష్టమవుతుందన్న ఆయన.. గతేడాది ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించడాన్ని, ఇటీవల ఇంగ్లండ్‌కు వారి అడ్డాలోనే షాకివ్వడాన్ని ఉదహరించాడు. అలాగే, దక్షిణాఫ్రికాను ఇటీవల జరిగిన టెస్ట్‌లో రఫ్ఫాడించడంలో కూడా ఆ ముగ్గురు సీమర్లదే కీలకపాత్ర అని మంజ్రేకర్‌ కొనియాడాడు. 

తాజాగా ఓ ప్రముఖ క్రీడా మాధ్యమంతో ఆయన మాట్లాడుతూ.. టీమిండియా బౌలింగ్‌ త్రయాన్ని పాక్‌ దిగ్గజ బౌలర్లతో పోల్చాడు. బుమ్రా, షమీ, సిరాజ్‌లను చూస్తే 90లలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన పాక్‌ దిగ్గజ బౌలర్లు గుర్తుకొస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో విదేశీ పిచ్‌లపై పాక్‌ బౌలర్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్‌ అక్తర్ అరివీర భయంకరంగా చెలరేగేవారని, ప్రస్తుతం టీమిండియా పేస్ త్రయం కూడా వారిలాగే విజృంభిస్తుందని వ్యాఖ్యానించాడు. కాగా, సఫారీలతో ముగిసిన తొలి టెస్ట్‌లో ఈ టీమిండియా బౌలింగ్‌ త్రయం ఏకంగా 16 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. 
చదవండి: నా వల్ల కాదు బాబోయ్‌..! పాక్‌ హెడ్‌ కోచ్‌ పదవికి సక్లయిన్‌ గుడ్‌బై

మరిన్ని వార్తలు