సార్‌.. బ్యాడ్‌ కామెంటేటర్‌ అనండి!

23 Oct, 2020 18:02 IST|Sakshi

న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్ఢ్‌కప్‌లో కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ తీవ్ర విమర్శలు వచ్చాయి. రవీంద్ర జడేజాను బిట్స్‌ అండ్‌ పీసెస్‌ క్రికెటర్‌ అని వ్యాఖ్యానించిన మంజ్రేకర్‌పై అప్పుడు ఫ్యాన్స్‌ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆ తర్వాత సహచర కామెంటేటర్‌ హర్షా భోగ్లేను చులకన చేస్తూ మాట్లాడాడు మంజ్రేకర్‌. ఇవన్నీ మంజ్రేకర్‌ కామెంటరీకి మచ్చతెచ్చాయి. కామెంటేటర్‌గా అప్పటివరకూ ఉన్న మంచి పేరు కాస్త పోయింది. ఇదేమి కామెంట్రీ అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ కామెంటరీ ప్యానల్‌లో సంజయ్‌ మంజ్రేకర్‌ లేడు. వివాదాస్పద వ్యాఖ్యలే మంజ్రేకర్‌ను కామెంట్రీ ప్యానల్‌లో చేర్చకపోవడానికి ప్రధాన కారణం. 

అయితే తాజాగా మరొకసారి మంజ్రేకర్‌ వార్తల్లోకి వచ్చాడు. ఐపీఎల్‌లో మంజ్రేకర్‌కు స్థానం ఇవ్వకపోవడాన్ని ఎత్తిచూపుతూ ‘బిట్స్‌ అండ్‌ పీసెస్‌ కామెంటేటర్‌’ అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించాడు. ట్వీటర్‌ అకౌంట్‌లో మంజ్రేకర్‌ను కోడ్‌ చేస్తూ మరీ విమర్శించాడు. దీనికి మంజ్రేకర్‌ స్పందిస్తూ.. ‘ లేదు సార్‌.. బిట్స్‌ అండ్‌ పీసెస్‌ కామెంటేటర్‌ కాదు. నేను పూర్తిస్థాయి కామెంటేటర్‌ను. బిట్స్‌  అండ్‌ పీసెస్‌ అంటే కొంచెం కొంచెంగా ఉంటుంది. ఒకవేళ నా కామెంట్రీ నచ్చకపోతే బ్యాడ్‌ కామెంటేటర్‌ అనండి. అంతేగానీ బిట్స్‌ అండ్‌ పీసెస్‌ అంటే నాకు సరితూగదు’ అని కొంటెగా సమాధానమిచ్చాడు. ఈ ఐపీఎల్‌ ఆరంభానికి ముందు తనకు కామెంట్రీ ప్యానల్‌లో అవకాశం ఇ‍వ్వాలని బీసీసీఐని పదే పదే ప్రాధేయపడ్డాడు మం‍జ్రేకర్‌. ఈ మెయిల్స్‌ ద్వారా బీసీసీఐ లేఖలు రాసి గైడ్‌లైన్స్‌ ప్రకారమే నడుచుకుంటానని విన్నవించాడు. అయినా మంజ్రేకర్‌కు కామెంట్రీ ప్యానల్‌లో అవకాశం దక్కలేదు. (పొలార్డ్‌ బ్యాగ్‌లు సర్దుకోమన్నాడు: బ్రేవో)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు