నటరాజన్‌ రాకతో షమీకి కష్టమేనా : మంజ్రేకర్‌

5 Dec, 2020 10:54 IST|Sakshi

కాన్‌బెర్రా : ఆసీస్‌తో  శుక్రవారం కాన్‌బెర్రా వేదికగా జరిగిన తొలి టీ20లో టి. నటరాజన్‌ మరోసారి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. నిన్న జరిగిన టీ20లో జడేజా స్థానంలో కాంకషన్‌గా వచ్చిన చహాల్‌ మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచినా.. నటరాజన్‌ బౌలింగ్‌ను తీసిపారేసిదిగా కనిపించదు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ నటరాజన్‌ ప్రదర్శపై ప్రసంశలు కురిపించాడు. నటరాజన్‌ రాకతో టీ20 ఫార్మాట్‌లో మహ్మద షమీకి కష్టమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : టీమిండియా ‘కాంకషన్‌‌’ రైటా... రాంగా!)

సోనీసిక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్‌ మాట్లాడుతూ.. ' టీ20 స్పెషలిస్ట్‌గా తుది జట్టులోకి వచ్చిన నటరాజన్‌  తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. నా దృష్టిలో మహ్మద్‌ షమీ స్థానాన్ని నటరాజన్‌ భర్తీ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇక పొట్టి ఫార్మాట్‌లో షమీ స్థానం పదిలంగా ఉంటుందా అన్న అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో నటరాజన్‌ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. మరో పేసర్‌ బుమ్రాకు సరిజోడిగా కనిపిస్తున్నాడు. పైగా వీరిద్దరి కాంబినేషన్‌ కూడా చాలా బాగుంది.' అంటూ తెలిపాడు. (చదవండి : కోహ్లి.. ఇదేం వ్యూహం?)

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చిన నటరాజన్‌ను ఆసీస్‌ పర్యటనకు ఎంపిక చేశారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరపున 16 వికెట్లు తీసిన నటరాజన్‌ యార్కర్ల స్పెషలిస్ట్‌గా ముద్ర వేశాడు. ఆ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా అతని ప్రదర్శనను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేతో అరంగేట్రం చేసిన నటరాజన్‌ మార్నస్‌ లబుషేన్‌ వికెట్‌ తీసి మెయిడెన్‌ వికెట్‌ తీశాడు. శనివారం జరిగిన టీ20లో ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను అవుట్‌ చేసి తొలి టీ20  వికెట్‌ తీసిన నటరాజన్‌ తర్వాత ఓపెనర్‌ డీ ఆర్సీ షాట్‌తో పాటు మిచెల్‌ స్టార్క్‌ను పెవిలియన్‌ చేర్చి భారత్‌ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. 

మరిన్ని వార్తలు