ఆ అహంకారమే పనికిరాదు కోహ్లి..

23 Mar, 2021 16:20 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డాడు. జట్టు కూర్పు విషయంలో బయటి వ్యక్తులు మాట్లాడే మాటలు, విమర్శలు అర్థరహితమని కోహ్లి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టాడు. ఈ అహంకారమే అతనికి పనికిరాదని, ప్రశాంతంగా, మెచ్యుర్‌గా ఎలా ఉండాలో ధోనీని చూసి నేర్చుకోవాలని ట్విటర్ వేదికగా చురకలంటించాడు. 

కాగా, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు సోమవారం మీడియాతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో కోహ్లి మాట్లాడుతూ.. జట్టు కూర్పు విషయంలో బయట జరిగే చర్చంతా నాన్‌సెన్స్ అని కొట్టిపారేశాడు. ఇంగ్లండ్‌తో టీ20ల సిరీస్‌లో తుది జట్టులో పదే పదే మార్పులు చేయడం, వరుసగా విఫలమైన కేఎల్ రాహుల్‌ను జట్టులో కొనసాగించడం పట్ల విమర్శలు వ్యక్తమయిన నేపథ్యంలో కోహ్లి పైవిధంగా స్పందించాడు. 'ఆటగాళ్ల గురించి బయటి వ్యక్తుల వ్యాఖ్యలు పట్టించుకోకపోవడం ఉత్తమమని, గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆటగాడితో ఎలా వ్యవహరించాలో టీం మేనేజ్‌మెంట్‌కు బాగా తెలుసునని కోహ్లి వ్యాఖ్యనించాడు. 

మరిన్ని వార్తలు