మను భాకర్‌కు రెండు స్వర్ణాలు

30 Jul, 2023 06:33 IST|Sakshi

వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత అగ్రశ్రేణి షూటర్‌ మనూ భాకర్‌ రెండు  పసిడి పతకాలతో మెరిసింది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో శనివారం భారత్‌ ఖాతాలో 3 స్వర్ణాలు, ఒక కాంస్యం చేరాయి. భారత్‌ ఖాతాలో చైనాలోని చెంగ్డూలో జరుగుతున్న క్రీడల్లో భాకర్‌ 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌ వ్యక్తిగత, మహిళల టీమ్‌ విభాగాల్లో స్వర్ణాలు సాధించింది.

టీమ్‌ ఈవెంట్‌లో ఆమెతో పాటు యశస్విని సింగ్‌ దేశ్వాల్, అభింద్య అశోక్‌ పాటిల్‌ సభ్యులుగా ఉన్నారు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలోనూ భారత్‌కు చెందిన ఎలవెనిల్‌ వలరివన్‌ స్వర్ణ పతకం గెలుచుకుంది. మరో వైపు జూడో 57 కేజీల మహిళల విభాగంలో భారత్‌కు చెందిన యామిని మౌర్య కాంస్య పతకం సాధించింది.  

మరిన్ని వార్తలు