Marcus Stoinis: ఆ ముగ్గురు దిగ్గజాలు క్రికెట్‌ను ఏలేవారేమో!

7 Apr, 2023 18:44 IST|Sakshi
Photo: IPL Twitter

ఆస్ట్రేలియా విధ్వంసక ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా టి20ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన స్టోయినిస్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ 16వ సీజన్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఐపీఎల్‌లో కేఎల్‌ రాహుల్‌ సారధ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  కాగా ఇవాళ ఎస్‌ఆర్‌హెచ్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అమితుమీ తేల్చుకోనుంది.

కాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న స్టోయినిస్‌ ఐపీఎల్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్రీడారంగానికి సంబంధించి నీకిష్టమైన ముగ్గురు రిటైర్డ్‌ ఆటగాళ్ల పేర్లు చెప్పమని అడిగారు. దీనికి స్టోయినిస్‌.. మాజీ బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకెల​ జోర్డాన్‌, గోల్ఫ్‌ దిగ్గజం టైగర్‌వుడ్స్‌, బాక్సింగ్‌ దిగ్గజం మహమూద్‌ అలీ పేర్లను ఏంచుకున్నాడు.

ఒకవేళ ఈ ముగ్గురు ఆయా రంగాల్లో కాకుండా క్రికెట్‌లో ఆడుంటే ఈ ఆటను కూడా ఏలేవారేమో అని పేర్కొన్నాడు.  ఇక తాను, ఆస్టన్‌ అగర్‌ యూఎఫ్‌సీకి పెద్ద అభిమానులమని.. ఎప్పుడు మ్యాచ్‌లు జరిగినా తప్పుకుండా చూస్తామన్నాడు. యూఏఈ వేదికగా జరిగిన 2021 టి20 ప్రపంచకప్‌ సందర్భంగా గోల్ప్‌ ఆడడానికి పొవెళ్లాం. అక్కడ యూఎఫ్‌సీ ఛాంపియన్స్‌గా ఫోజు ఇవ్వడం ఇప్పటికి మరిచిపోలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్టోయినిస్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఇప్పటివరకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో గెలిచి మరొక దాంట్లో ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో గెలిచిన లక్నో.. సీఎస్‌కే చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.

చదవండి: IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది'

మరిన్ని వార్తలు