Maria Sharapova Pregnancy: తల్లికాబోతున్న ‘టెన్నిస్‌ స్టార్‌’.. సోషల్‌ మీడియాలో పోస్టుతో

20 Apr, 2022 09:45 IST|Sakshi

రష్యా మాజీ టెన్నిస్‌ స్టార్‌ మారియా షరపోవా అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. త్వరలోనే తాను తల్లికాబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు.. ‘‘అమూల్యమైన సరికొత్త ఆరంభాలు!!’’ అంటూ తాను గర్భవతినన్న విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. బీచ్‌లో నిల్చుని ఉన్న ఫొటోను షేర్‌ చేసి తల్లి కాబోతున్న అనుభూతులను పదిలం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

కాగా తన కెరీర్‌లో ఐదు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన షరపోవా.. 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ‘‘మరో  ఉన్నత శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యాను. విభిన్నమైన మైదానంలో పోటీపడబోతున్నాను. టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నా’’ అంటూ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక షరపోవా వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త అలెగ్జాండర్‌ గిల్కెస్‌తో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇక వీరిద్దరు త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

A post shared by Maria Sharapova (@mariasharapova)

మరిన్ని వార్తలు