ENG_W vs SA-W: టెస్టుల్లో చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌.. 61 ఏళ్ల రికార్డు బద్దలు..!

28 Jun, 2022 13:32 IST|Sakshi

ఇంగ్లండ్‌ మహిళలతో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ మారిజాన్‌ కాప్‌ రికార్డుల మోత మోగించింది. ఈ మ్యా్చ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కాప్‌ అద్భుతమైన సెంచరీ సాధించింది. కాగా కాప్‌కు తన టెస్టు కెరీర్‌లో ఇదే తొలి టెస్టు సెం‍చరీ కావడం గమనార్హం. ఇక 213 బంతుల్లో 150 పరుగులు చేసిన కాప్‌.. తమ జట్టు 284 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ సాధిండంలో కీలక పాత్ర పోషించింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 45 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కాప్‌ జట్టును అదుకుంది. ఒక వైపు వికెట్లు పడుతున్నా కాప్‌ ఒంటిరి పోరాటం చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 91.3 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో కేట్ క్రాస్ నాలుగు వికెట్లు,బెల్‌ రెండు,ఇసాబెల్లె వాంగ్,సోఫీ ఎక్లెస్టోన్,డేవిడ్సన్ రిచర్డ్స్,నటాలీ స్కివర్ తలా వికెట్‌ సాధించారు.

ఈ మ్యాచ్‌లో కాప్‌ సాధించిన రికార్డులు
150 పరుగులు చేసిన కాప్‌.. టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. 
అంతకుముందు 1961లో వైవోన్ వాన్ మెంట్జ్ ఇంగ్లండ్‌పై 105 పరుగులు సాధించింది.
మహిళల టెస్టుల్లో ఆరు లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్‌ వచ్చి అత్యధిక స్కోర్‌ సాధించిన తొలి క్రికెటర్‌గా కాప్ నిలిచింది.
మహిళల టెస్టుల్లో అత్యధిక వేగంగా 150 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా  కాప్ రికార్డులకెక్కింది.
 కాప్‌ 212 బంతుల్లో ఈ ఘనత సాధించగా. అంతకుముందు  ఆస్ట్రేలియా క్రికెటర్‌ కరాన్‌ రోల్టాన్‌ 213 బంతుల్లో ఈ ఫీట్‌ను నమోదు చేసింది.
మహిళల టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన జాబితాలో కాప్‌(150) ఐదో స్థానంలో నిలిచింది.
ఆస్ట్రేలియా క్రికెటర్‌ మిచెల్ గోజ్కో 204 పరుగులతో తొలి స్థానంలో కొనసాగుతుంది.
చదవండి: Ind Vs IRE Predicted Playing XI: రాహుల్‌ త్రిపాఠికి ఛాన్స్‌.. అర్ష్‌దీప్‌ ఎంట్రీ!

మరిన్ని వార్తలు