ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌గా మార్క్ బౌచర్‌!

15 Sep, 2022 13:26 IST|Sakshi
మార్క్‌ బౌచర్‌ PC: Cric Tracker

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ తమ కోచింగ్‌ స్టాప్‌లో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. జట్టు హెడ్‌ కోచ్‌ మహేళ జయవర్థనేను ముంబై ఇండియన్స్‌ (ఎంఐ) గ్రూప్‌ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పదవి అప్పజెప్పగా...క్రికెట్‌ ఆపరేషన్‌ డైరక్టర్‌ జహీర్‌ ఖాన్‌ను ఎంఐ గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా పదనోత్నతి కల్పించింది.

ఈ క్రమంలో జయవర్థనే స్థానంలో ముంబై ఇండియన్స్‌ హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మార్క్ బౌచర్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై కేప్‌టౌన్‌ ప్రాధాన కోచ్‌గా బౌచర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తొలుత వార్తలు వినిపించాయి.

అయితే తాజగా ముంబై కేప్‌టౌన్‌ హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ సైమన్ కటిచ్ నియమితడయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌గా బౌచర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక​ ఇప్పటికే ముంబై గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్‌ జయవర్థనే..  బౌచర్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

ఈ విషయంపై మరో వారం రోజుల్లో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం దక్షిణాప్రికా హెడ్‌కోచ్‌గా ఉన్న బౌచర్.. టీ20 ప్రపంచకప్‌ అనంతరం తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ఇక గతంలో కూడా ఐపీఎల్‌లో కోచ్‌గా పనిచేసిన అనుభవం బౌచర్‌కు ఉంది. 2016లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వికెట్ కీపింగ్ సలహాదారుగా అతడు పనిచేశాడు.
చదవండి: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్‌ కీలక నిర్ణయం!

మరిన్ని వార్తలు