Martina Navratilova: క్యాన్సర్‌ మహమ్మారి నుంచి బయటపడిన టెన్నిస్‌ దిగ్గజం

23 Mar, 2023 11:40 IST|Sakshi

మహిళల టెన్నిస్‌ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా క్యాన్సర్‌ మహమ్మారి నుంచి బయటపడింది. మూడు నెలల క్రితం నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు గురైనట్లు వైద్యులు పేర్కొన్నారు. అప్పటినుంచి క్యాన్సర్‌తో పోరాడిన ఆమె ఎట్టకేలకు దాని నుంచి విముక్తి పొందినట్లు స్వయంగా ప్రకటించింది.

''క్యాన్సర్‌ మహమ్మారి నుంచి ఇంత త్వరగా కోలుకుంటానని అనుకోలేదు. చికిత్స సందర్భంగా 15 పౌండ్ల బరువు తగ్గాను. ఆ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. అన్ని భరించి ఇవాళ మహమ్మారి నుంచి విముక్తి సంపాదించా. ఇక క్యాన్సర్‌ నుంచి విముక్తి కలగగానే టీవీ చానల్‌ బాధ్యతల్లో లీనమయ్యా.'' అంటూ తెలిపింది.

ప్రస్తుతం 66 ఏండ్ల నవ్రతిలోవా మియామీ ఓపెన్‌లో టీవీ చానల్‌ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంది. అమెరికాకు చెందిన మార్టినా నవ్రతిలోవా 18 సింగిల్స్‌ , 31 మహిళల డబుల్స్‌, 10 మిక్స్‌డ్‌ డబుల్స్‌తో మొత్తంగా 59 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గి చరిత్ర సృష్టించింది.

1970,80వ దశకంలో ఆమె సమకాలీకురాలు క్రిస్‌ ఎవర్ట్‌తో పోటీ పడిన నవ్రతిలోవా  దిగ్గజ టెన్నిస్‌ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది.1981లో అమెరికా పౌరసత్వం రాగానే తనను తాను లెస్బియన్‌గా ప్రకటించుకున్న నవ్రతిలోవా అప్పటి నుంచి ఎల్జీబీటీ(LGBT) హక్కుల కోసం పోరాడుతూ వచ్చింది.

చదవండి: దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు?

అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్‌ క్రికెటర్‌ గుడ్‌బై

మరిన్ని వార్తలు