Marylebone Cricket Club: ఇక ‘బ్యాట్స్‌మన్‌’ కాదు.. బ్యాటర్‌!

23 Sep, 2021 07:48 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

Batter Instead Of Batsman: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ నిబంధనలను రూపొందించే మెరిలిబోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) ఒక కీలక మార్పు చేసింది.  కేవలం పురుష ఆటగాడినే గుర్తు చేసే ‘బ్యాట్స్‌మన్‌’కు బదులుగా ఇకపై మహిళలకు కూడా ఉపయోగించే విధంగా ‘బ్యాటర్‌’ పదాన్ని చేర్చాలని నిర్ణయించింది. క్రీడల్లో లింగ వివక్ష ఉండరాదని, సాంకేతిక పదాల్లో కూడా అది కనిపించరాదనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేసినట్లు ఎంసీసీ ప్రకటించింది. ఇదే తరహాలో ‘బ్యాట్స్‌మెన్‌’ స్థానంలో ‘బ్యాటర్స్‌’ అని వ్యవహరిస్తారు.

చదవండి: సంపాదనలో మెస్సీని దాటేశాడు.. ఏడాదికి 922 కోట్లు అర్జిస్తున్నాడు

>
మరిన్ని వార్తలు