Master Card: బీసీసీఐ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులు దక్కించుకున్న మాస్టర్ కార్డ్‌

5 Sep, 2022 16:06 IST|Sakshi

Mastercard Acquires Title Sponsorship Rights For All BCCI  Home Matches: బీసీసీఐ ఆధ్వర్యం‍లో స్వదేశంలో జరిగే జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులను గ్లోబల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్‌ కార్డ్‌ దక్కించుకుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటివరకు బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తప్పుకోవడంతో మాస్టర్‌ కార్డ్‌ ఆ స్థానాన్ని భర్తీ చేయనుంది. పేటీఎం అభ్యర్థన మేరకే బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ హక్కులను మాస్టర్ కార్డ్‌కు మళ్లించింది. ఈ డీల్‌కు సంబంధించిన ఒప్పంద ప్రక్రియ మొత్తం పూర్తైందని బీసీసీఐ వివరించింది.

కాగా, బీసీసీఐ.. 2015లో పేటీఎంతో నాలుగేళ్లకు గాను 203 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. నాటి నుంచి భారత్‌లో ఆడే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు పేటీఎం టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈనెల స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి మాస్టర్ కార్డ్‌ బీసీసీఐ కొత్త టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. బీసీసీఐ-మాస్టర్‌ కార్డ్‌ల మధ్య ఒప్పందం 2023 మార్చి వరకు కొనసాగనుంది.
చదవండి: టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్‌ శర్మ..
 

మరిన్ని వార్తలు