Mayank Agarwal: ఆయన వీడియోలు చూసి నా బ్యాటింగ్‌ స్టైల్‌ మార్చుకున్నా..

4 Dec, 2021 14:25 IST|Sakshi

Mayank Agarwal Explains How Sunil Gavaskars Advice Ahead Of Mumbai Test Helped: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో టెస్టులో టీమిండియా ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్ సెంచరీతో చెలరేగాడు. రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ చతేశ్వర పుజారా, కెప్టెన్‌ కోహ్లి డకౌట్‌లుగా పెవిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో  జట్టు భారాన్ని తన భుజాన వేసుకుని మయాంక్ నడిపించాడు. తొలి రోజు ఆటలో 125 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్ తన బ్యాటింగ్‌ స్టైల్‌ను మార్చుకోవాలని సూచించారని మయాంక్ తెలిపాడు.

తొలి రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన  అగర్వాల్..  "గవాస్కర్ సార్ నాతో చెప్పారు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో బ్యాట్ కాస్త కిందకి పెట్టి ఆడమని సలహా ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగా నా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో మార్పు చేసుకున్నాను. సునీల్ గవాస్కర్ వీడియోలు చూస్తూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశా .ఈ మ్యాచ్‌కు ముందు రాహుల్ ద్రావిడ్ సర్‌ వచ్చి నాతో మాట్లాడారు. 

నీకు దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీవు మైదానంలో ఉత్తమమైన ప్రదర్శన చేయాలి. క్రీజులో నీవు సెట్‌ అయినప్పుడు.. భారీ స్కోరు చేయడంపై దృష్టి సారించు అని ఆయన నాతో చెప్పారు. ఆయన చెప్పినట్లే నేను క్రీజులో కుదురు పడ్డాకే  భారీ స్కోర్‌ చేయడానికి ప్రయత్నించాను" అని తెలిపాడు.

చదవండి: Ind vs NZ 2nd Test: రికార్డుల అజాజ్‌..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. స్పందించిన కుంబ్లే

మరిన్ని వార్తలు