'ఐపీఎల్‌ యాంకరింగ్‌ మిస్సవుతున్నా'

19 Sep, 2020 11:30 IST|Sakshi

ముంబై : పలు ఐపీఎల్‌ సీజన్లలో యాంకరింగ్‌తో మంచి పాపులరిటీ సంపాదించిన మాయంతి లాంగర్ ఆరువారాల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తన భర్త  ప్రముఖ క్రికెటర్‌ స్టువర్ట్‌​ బిన్నీతో కలసి చేతిలో బిడ్డతో దిగిన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. 'ఈసారి ఐపీఎల్‌ 2020 యాంకరింగ్‌ మిస్సవుతున్నా.. కానీ ఇంట్లోనే ఉంటూ రోజువారి ఐపీఎల్‌ మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్‌లో చూస్తూ ఎంజాయ్‌ చేయబోతున్నా. ఈ సందర్భంగా మా గ్యాంగ్‌ సభ్యులైన జతిన్‌ సపారు, సుహైల్‌ చాందోక్‌, క్రికెట్‌ ఆకాశ్‌, సంజన గణేషన్‌, స్కాట్‌ బైరిస్‌, బ్రెట్‌ లీ లాంటి వాళ్లను మిస్సవుతున్నా.. అంటూ' పేర్కొన్నారు. (చదవండి : 'మేం లేకపోయినా.. చెన్నైకి నష్టం లేదు')

'గత ఐదేళ్లుగా స్టార్‌స్పోర్ట్స్‌ తన కుటుంబంలో నన్ను ఒకదానిలా చూసింది. వారు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఒక యాంకర్‌గా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించా. కరోనా లేకపోయుంటే మార్చిలో ఐపీఎల్‌ జరుగుంటే.. ఐదు నెలల ప్రెగ్నెన్సీతో యాంకరింగ్‌ చేద్దామనుకున్నా. కరోనా వల్ల దాదాపు నెలల తర్వాత ఐపీఎల్‌ మొదలవుతుంది.  కానీ స్టార్‌స్పోర్ట్స్‌ యాజమాన్యం నాకు ఈ విషయంలో చాలా మద్దతునిచ్చింది. ఆ విషయంలో వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఆరు వారాల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చా. స్టువర్ట్‌ బిన్నీ, బిడ్డతో కలిసి మధురక్షణాలను అనుభవిస్తున్నా.. బాబు మా జీవితంలోకి ప్రేవేశించాకా చాలా కొత్తగా అనిపిస్తుందంటూ' తెలిపారు.(చదవండి : 'ఆర్‌సీబీలో కోహ్లి, డివిలియర్స్‌ ఫేవరెట్‌ కాదు')

స్పోర్ట్స్‌ వ్యాఖ్యాతల్లో తనదైన ముద్ర వేసిన మయాంతి ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్‌ టోర్నీలతో పాటు ఇండియన్‌ కౌన్సిల్‌ లీగ్‌(ఐసీఎల్‌), ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లాంటి టోర్నీలకు యాంకర్‌గా వ్యవహరించారు. ఇక మయాంతి భర్త క్రికెటర్‌ స్టువర్ట్‌ బిన్నీ టీమిండియా తరపున 14 వన్డేలు, 6 టెస్టులు ఆడాడు. రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బిన్నీని గతేడాది ఐపీఎల్‌ వేలం సందర్భంగా జట్టు నుంచి రిలీజ్‌ చేసింది. 

మరిన్ని వార్తలు