Hockey WC 2023: ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్‌

15 Jan, 2023 10:49 IST|Sakshi

సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో పూల్‌ ‘డి’లో భాగంగా నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడుతుంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలోని టీమిండియా తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌పై 2–0తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లండ్‌ తమ తొలి మ్యాచ్‌లో 5–0తో వేల్స్‌ను ఓడించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.    

బెల్జియం భారీ విజయం
పురుషుల ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెల్జియం జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. పూల్‌ ‘బి’లో భాగంగా దక్షిణ కొరియాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 5–0తో గెలుపొందింది. బెల్జియం తరఫున హెండ్రిక్స్‌ (31వ ని.లో), కాసిన్స్‌ (43వ ని.లో), ఫ్లోరెంట్‌ (50వ ని.లో), సెబాస్టియన్‌ డాకియర్‌ (52వ ని.లో), ఆర్థర్‌ స్లూవెర్‌ (58వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. ఇతర మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ 3–1తో చిలీపై, నెదర్లాండ్స్‌ 4–0తో మలేసియాపై, జర్మనీ 3–0తో జపాన్‌పై విజయం సాధించాయి.     

మరిన్ని వార్తలు