Lionel Messi: మెస్సీనా మజాకా.. జట్టు కోసం 35 గోల్డ్‌ ఐఫోన్స్‌

2 Mar, 2023 19:26 IST|Sakshi

మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్‌కప్‌ సాధించి దాదాపు మూడు నెలలు కావొస్తుంది. అయితే ఇప్పటికి ఫుట్‌బాల్‌ అభిమానులు మెస్సీ మాయ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అన్నీ తానై నడిపించిన మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌ అందుకోవాలనే తన కలతో పాటు 36 ఏళ్ల అర్జెంటీనా నిరీక్షణకు తెరదించాడు. అందుకే ఫిఫా చరిత్రలోనే అర్జెంటీనా, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ఫైనల్‌ అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్‌గా నిలిచిపోయింది. 

ఫైనల్లో గోల్స్‌ కొట్టి గోల్డెన్‌ బాల్‌ అవార్డు సొంతం చేసుకున్న మెస్సీ ఇప్పటికే ఫిఫా మెన్స్‌ అత్యుత్తమ ఆటగాడిగా అవార్డు కూడా అందుకున్నాడు. తాజాగా మెస్సీ చేసిన ఒక పని అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదేంటో తెలుసా.. ఫిఫా వరల్డ్‌కప్‌ అందుకున్న అర్జెంటీనా టీమ్‌, స్టాఫ్ కోసం  మెస్సీ రూ. 1.73 కోట్ల విలువైన 35 గోల్డ్ ఐఫోన్‌ల‌ను ఆర్డర్ చేయడం విశేషం. స్పెష‌ల్‌గా తయారయిన ఈ గోల్డ్ ఐఫోన్లపై ఆట‌గాడి పేర్లు, జెర్సీ నెంబ‌ర్లు, అర్జెంటీనా లోగోను ముద్రించారు.

ఈ ఐఫోన్లు వారాంతంలో మెస్సీ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాయ‌ని స‌మాచారం. ఫిఫా వ‌ర‌ల్డ్ కప్ అర్జెంటీనా సొంతం కావ‌డంతో ఈ వేడుక‌ను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని ఆట‌గాళ్లకు ప్రత్యేక‌మైన బ‌హుమ‌తులు అందించాల‌ని మెస్సీ భావిస్తున్నాడు. ఎంటర్‌ప్రెన్యూర్ బ‌న్ లైన్స్‌తో క‌లిసి మెస్సీ డివైజ్‌ల డిజైన్‌ను రూపొందించినట్లు ది సన్‌ పత్రిక కథనం ప్రచురించింది.

టీం స‌భ్యుల‌కు, స‌పోర్ట్ స్టాఫ్‌కు మెస్సీ గోల్డ్ ఐఫోన్‌గా ఐఫోన్-14ను ఎంచుకున్నారు. ఫోన్ డిజైన్‌తో పాటు ఐఫోన్లను మెస్సీ రిసీవ్ చేసుకున్న ఫొటోను ఐ-డిజైన్ గోల్డ్ అధికారిక ఇన్‌స్టాగ్రాం ఖాతా వెల్లడించింది. ఫిఫా వరల్డ్‌కప్‌ గెలుపొందిన మెస్సీ బృందంతో పాటు స్టాఫ్ కోసం 35 గోల్డ్ ఐఫోన్లను డెలివ‌రీ చేయ‌డం గౌర‌వంగా భావిస్తున్నామ‌ని క్యాప్షన్‌ జత చేసింది.

ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన అర్జెంటీనా జట్టు: ఎమి మార్టినెజ్, ఫ్రాంకో అర్మానీ, గెరోనిమో రుల్లి, మార్కోస్ అకునా, జువాన్ ఫోయ్త్, లిసాండ్రో మార్టినెజ్, నికోలస్ టాగ్లియాఫికో, క్రిస్టియన్ రొమెరో, నికోలస్ ఒటామెండి, నహుయెల్ మోలినా, గొంజాలో మోంటియెల్, లెగో జర్మన్ పర్జెల్, ఆంరో జర్మన్ పర్జెల్, రోడ్రి పెజ్జెల్లా, డి పాల్, అలెక్సిస్ మాక్ అలిస్టర్, ఎంజో ఫెర్నాండెజ్, ఎక్సిక్వియెల్ పలాసియోస్, గైడో రోడ్రిగ్జ్, లియోనెల్ మెస్సీ, లౌటరో మార్టినెజ్, పాలో డైబాలా, ఏంజెల్ కొరియా, జూలియన్ అల్వారెజ్, థియాగో అల్మడ, అలెజాండ్రో గోమెజ్

A post shared by 𝗜𝗗𝗘𝗦𝗜𝗚𝗡 𝗚𝗢𝗟𝗗 (@idesigngold)

A post shared by 𝘽𝙚𝙣𝙟𝙖𝙢𝙞𝙣 𝙇𝙮𝙤𝙣𝙨 (@benlyons1111)

చదవండి: అదే రెండున్నర రోజులు.. సీన్‌ మాత్రం రివర్స్‌!

స్టన్నింగ్‌ క్యాచ్‌.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్‌

మరిన్ని వార్తలు