భార్యతో మెస్సీ భావోద్వేగ క్షణాలు: వైరల్‌ వీడియో

11 Jul, 2021 22:29 IST|Sakshi

28 ఏళ్ల నిరీక్షణ తర్వాత అర్జెంటీనా టీం 15వ కోపా అమెరికా ట్రోఫీని ఎత్తి సంబురాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఉత్కంఠభరింతగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బ్రెజిల్‌ను ఓడించింది అర్జెంటీనా. అయితే ఆదివారం జరిగిన కోపా అమెరికా ఫైనల్లో అర్జెంటీనా బ్రెజిల్‌ను 1-0తో ఓడించడంతో మెస్సీ తన భార్య ఆంటోనెల్లా రోకుజోతో భావోద్వేగ విజయ క్షణాలు పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 

ప్రస్తుతం బార్సిలోనాలోని క్యాంప్ నౌలో మెస్సీ తన భార్య, ముగ్గురు పిల్లలతో  నివసిస్తున్నాడు.  వాళ్ల పేర్లు వరుసగా థియాగో, మాటియో, సిరో. కాగా, ఈ వీడియో పై  మెస్సీ భార్య ఆంటోనెల్లా స్పందిస్తూ.. "మీ ఆనందం నాది! మీకు నా అభినందనలు, ప్రేమ" అని కామెంట్‌ చేశారు. ఇక "వామోస్ అర్జెంటీనా" అనే క్యాప్షన్‌తో మరో వీడియోను మెస్సీ భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా.. కేవలం రెండు గంటల్లో మూడు మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఈ రెండు వీడియోలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
 


 

A post shared by Antonela Roccuzzo (@antonelaroccuzzo)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు