రోహిత్‌ శర్మ ఔట్‌..

23 Oct, 2020 19:16 IST|Sakshi

షార్జా: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా సీఎస్‌కేతో జరుగుతున్న  రెండో అంచె మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ తాత్కాలిక కెప్టెన్‌ కీరోన్‌ పొలార్డ్‌.. ముందుగా సీఎస్‌కేను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అనారోగ్యానికి గురైన రోహిత్‌ శర్మ.. ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. రోహిత్‌ శర్మ స్థానంలో సౌరవ్‌ తివారీని తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక సీఎస్‌కే మూడు మార్పులు చేసింది. కేదార్‌ , షేన్‌ వాట్సన్‌, పీయూష్‌ చావ్లాలను తప్పించింది. వీరి స్థానాల్లో జగదీశన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇమ్రాన్‌ తాహీర్‌లకు అవకాశం ఇచ్చింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించింది.

కాగా, ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్‌ 9 మ్యాచ్‌లాడి 6 విజయాలు సాధించగా,  సీఎస్‌కే 10 మ్యాచ్‌లకు గాను మూడే విజయాలు నమోదు చేసింది.  ఇక సీఎస్‌కే ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించగా, ముంబై ఇండియన్స్‌ గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విక్టరీలు సాధించింది. ఓవరాల్‌గా ఇరుజట్లు 29సార్లు ముఖాముఖి తలపడగా ముంబై ఇండియన్స్‌ 17 సార్లు విజయం సాధించగా, సీఎస్‌కే 12సార్లు విజయకేతనం ఎగురవేసింది. 

ఈ సీజన్‌లో ఇరుజట్లలో అత్యధిక పరుగులు చేసిన వారిలో డుప్లెసిస్‌(375-సీఎస్‌కే), క్వింటాన్‌ డీకాక్‌(322-ముంబై ఇండియన్స్‌), షేన్‌ వాట్సన్‌( 285-సీఎస్‌కే), రోహిత్‌ శర్మ(260-ముంబై ఇండియన్స్‌), అంబటి రాయుడు(250- సీఎస్‌కే)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇక అత్యధిక వికెట్ల జాబితాలో జస్‌ప్రీత్‌ బుమ్రా(15-ముంబై ఇండియన్స్‌), ట్రెంట్‌ బౌల్డ్‌(12-ముంబై ఇండియన్స్‌),  రాహుల్‌ చాహర్‌(11-ముంబై ఇండియన్స్‌), దీపక్‌ చాహర్‌(12-సీఎస్‌కే), సామ్‌ కరాన్‌(10-సీఎస్‌కే)లు వరుసగా ఉన్నారు.  

ముంబై ఇండియన్స్‌
కీరన్‌ పొలార్డ్‌(కెప్టెన్‌), డీకాక్‌, సౌరవ్‌ తివారీ, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా‌, నాథల్‌ కౌల్టర్‌ నైల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, రాహుల్‌ చాహర్‌, బుమ్రా

సీఎస్‌కే 
ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), డుప్లెసిస్‌, అంబటి రాయుడు, సామ్‌ కరాన్‌, జగదీశన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జోష్‌ హజిల్‌వుడ్‌, ఇమ్రాన్‌ తాహీర్‌

మరిన్ని వార్తలు