క్వార్టర్‌ ఫైనల్లో సానియా జోడీ.. టాప్‌ సీడ్‌ జంటను ఓడించి బొపన్న జోడి సంచలనం

29 Mar, 2022 08:04 IST|Sakshi

మియామి ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టెన్నిస్‌ టోర్నీలో సానియా మీర్జా (భారత్‌)–కిర్‌స్టెన్‌ ఫ్లిప్‌కెన్స్‌ (బెల్జియం) ద్వయం క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. కాలిఫోర్నియాలో సోమవారం జరిగిన మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సానియా–ఫ్లిప్‌కెన్స్‌ జోడీ 6–2, 6–4తో డెసిరె క్రాజిక్‌ (అమెరికా)–డెమీ షుర్స్‌ (నెదర్లాండ్స్‌) జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ మూడు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. 

టాప్‌ సీడ్‌ జోడీని ఓడించి క్వార్టర్స్‌కు... 
మియామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) జంట సంచలనం సృష్టించింది. కాలిఫోర్నియాలో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌లో బోపన్న–షపోవలోవ్‌ ద్వయం 6–3, 7–6 (7/3)తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ జంట పావిచ్‌–మెక్‌టిక్‌ (క్రొయే షియా)ను బోల్తా కొట్టించింది. ఈ ఓటమితో పావిచ్‌ వచ్చే వారం విడుదల చేసే డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను కోల్పోనున్నాడు.  

మరిన్ని వార్తలు