కరోనా: కోలుకున్న హస్సీ.. సాహాకు వింత అనుభవం

14 May, 2021 19:20 IST|Sakshi

ఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు.. సీఎస్‌కు బ్యాటింగ్‌ కోచ్‌ మైకెల్‌ హస్సీ కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో హస్సీకి నెగెటివ్‌గా తేలింది. కాగా హస్సీ ఆదివారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా హస్సీకి రెండుసార్లు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ స్పందించారు.

''హస్సీకి నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో కోవిడ్‌ నెగెటివ్‌గా తేలింది. ప్రస్తుతం అతను కోలుకున్నాడు. హస్సీ ఆసీస్‌ వెళ్లే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మే 15 వరకు ఆస్ట్రేలియా భారత్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో హస్సీ ట్రావెల్‌ బ్యాన్‌ ముగిసేవరకు ఇక్కడే ఉంటాడు. ఒకవేళ ఆస్ట్రేలియా విమానాల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు పెట్టకపోతే ఆదివారం హస్సీ ఆసీస్‌కు బయల్దేరుతాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తిరిగి ఆంక్షలు పెడితే మాత్రం హస్సీ మాల్దీవ్స్‌కు వెళ్లి అక్కడి నుంచి ఆసీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అతను ఆసీస్‌ వెళ్లే వరకు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది'' అంటూ ముగించాడు. కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు తర్వాత కామెంటేటర్‌ మైకెల్‌ స్లేటర్‌ సహా 40 మంది ఆసీస్‌ ఆటగాళ్లు మాల్దీవ్స్‌కు వెళ్లి అక్కడి నుంచి ఆసీస్‌ చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఇక టీమిండియా వికెట్‌కీపర్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహాకు కోవిడ్‌ పరీక్షలో వింత అనుభవం ఎదురైంది. ఐపీఎల్‌ 14వ సీజన్‌ నడుస్తుండగానే సాహాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెంటనే క్వారంటైన్‌కు వెళ్లిపోయాడు. ఇటీవలే 15 రోజుల ఐసోలేషన్‌ పూర్తి చేసుకున్న సాహా మరోసారి కోవిడ్‌ పరీక్ష చేయించుకున్నాడు. తొలిసారి పాజిటివ్‌ రావడంతో మరోసారి పరీక్ష చేయించుకున్నాడు. అయితే రెండోసారి నెగెటివ్‌ అని వచ్చింది. దీంతో సాహా మరో 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండడనున్నట్లు స్వయంగా వెల్లడించాడు. కాగా ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేసిన టీమిండియా జట్టును బీసీసీఐ ముంబైలో ఏర్పాటు చేసిన బయోబబూల్‌లో ఉంచనుంది.
చదవండి: మైకెల్‌ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్‌

మరిన్ని వార్తలు