మొటేరా పిచ్‌ ఎలా తయారవుతుందో చూడండి!

27 Feb, 2021 22:08 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా విజయం సాధించినప్పటి నుంచి ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు మైకెల్‌ వాన్‌ ఏదో ఒక విమర్శ చేస్తూనే వచ్చాడు. అసలు ఇది టెస్టు మ్యాచ్‌ నిర్వహించాల్సిన పిచ్‌ కాదని..  మూడో టెస్టులో ఎవరు విజయం సాధించలేదని.. టీమిండియా ఏం చేసినా ఐసీసీ అభ్యంతరం చెప్పకుండా అనుమతిస్తుందంటూ ఇంగ్లీష్‌ మీడియాలో ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా వాన్‌ మొటేరా పిచ్‌ నుంచి ఉద్దేశించి మరోసారి ట్రోల్‌ చేశాడు. నాలుగో టెస్టుకు సంబంధించి మొటేరా పిచ్‌ను క్యురేటర్‌ ఏ విధంగా రూపొందిస్తున్నాడో చూడండంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్‌ చేశాడు. ఆ ఫోటోలో ఒక రైతు తన ఎద్దులతో పొలం దున్నుతున్నట్లుగా ఉంది. వాన్‌ దీనిని మొటేరా పిచ్‌తో పోలుస్తూ.. 'మొటేరా పిచ్‌ను క్యురేటర్‌ కూడా ఇలానే సిద్ధం చేస్తున్నాడు. ఈసారి మాత్రం 5 రోజులు మ్యాచ్‌ జరిగేలా ప్రయత్నిస్తున్నట్లున్నాడు. ఈ ఐదు రోజులు కూడా పిచ్‌ స్పిన్‌కు అనుకూలించేలా రూపోందిస్తున్న అతన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా'అంటూ కామెంట్‌ చేశాడు. వాన్‌ షేర్‌ చేసిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రెండు రోజుల్లోనే ముగిసిన మూడో టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఈ విజయంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇప్పటికే 2-1తో సిరీస్‌లో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. మూడో టెస్టు విజయంతో ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఆఖరి టెస్టులో విజయం సాధించినా లేదంటే డ్రా చేసుకున్నా భారత్‌ ఫైనల్‌లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మార్చి 4వ తేదీ నుంచి మొదలుకానుంది.
చదవండి: ఇది 5 రోజుల టెస్టు పిచ్‌ కాదు: మాజీ క్రికెటర్‌
ఇలాంటి ప్లేస్‌‌లో 5 రోజులు ఉంటానా!

A post shared by Michael vaughan (@michaelvaughan)

మరిన్ని వార్తలు