Jonny Bairstow: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మరోసారి నిరూపితం

17 Aug, 2022 19:04 IST|Sakshi

కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక దశలో అనుకూలంగా కనిపించేదంతా రివర్స్‌ అయిపోతుంటుంది. తాజాగా ఇంగ్లండ్‌ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్‌ స్టో విషయంలో ఇదే జరిగింది. ఈ మధ్యకాలంలో బెయిర్‌ స్టో టెస్టులను కూడా టి20 స్టైల్లో ఆడుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌, భారత్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో ఇదే దూకుడు కనబరిచిన బెయిర్‌ స్టో మ్యాచ్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో చెలరేగిపోతున్న బెయిర్‌ స్టో సెంచరీలతో కథం తొక్కాడు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని మరోసారి నిరూపితం అయింది. 

తాజాగా లార్డ్స్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బెయిర్‌ స్టో డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రొటిస్‌ పేసర్‌ అన్‌రిచ్‌ నోర్ట్జే వేసిన బంతి బెయిర్‌ స్టోను క్లీన్‌బౌల్డ్‌ చేసింది. గుడ్‌లెంగ్త్‌తో వచ్చిన బంతి మిడిల్‌ స్టంప్‌ను గిరాటేయగా.. వికెట్‌ మొత్తం బయటటికి వచ్చింది. నోర్ట్జే ఎంత వేగంతో బంతిని వేశాడనేది దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక సౌతాఫ్రికాతో తొలి టెస్టును ఇంగ్లండ్‌ ఫేలవంగా ఆరంభించింది. తొలి సెషన్‌లోనే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా అందుకు తగ్గ ఫలితం సాధించింది. పేసర్లు నోర్ట్జే, రబాడలు పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకొని వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌ను ముప్పతిప్పలు పెట్టారు. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి ఇంగ్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఓలీ పోప్‌(61 బ్యాటింగ్).. ఒక్కడే ప్రొటిస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా స్టువర్ట్‌ బ్రాడ్‌(0) క్రీజులో ఉన్నాడు. 

చదవండి: కొత్త కోచ్‌గా రంజీ దిగ్గజం.. కేకేఆర్‌ దశ మారనుందా!

ప్రపంచ రికార్డుకు చేరువలో దీపక్‌ హుడా.. భారత్‌ తరపున తొలి ఆటగాడిగా

మరిన్ని వార్తలు