IPL 2022: 'సిరాజ్‌ చాలా దురదృష్టవంతుడు.. అతనికి అవకాశాలు ఇవ్వండి'

18 Mar, 2022 18:25 IST|Sakshi
Courtesy: IPL Twitter

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డైరెక్టర్ మైక్ హెస్సన్  ప్రశంసలు వర్షం కురిపించాడు. సిరాజ్‌ ఎప్పడూ చాలా ఉత్సాహంగా ఉండే క్రికెటర్ అని హెస్సన్ తెలిపాడు. సాదారణంగా ఆటగాళ్లు అద్భతమైన ఫామ్‌లో ఉన్నప్పడు ఉత్సహంగా కనిపిస్తారు. సిరాజ్‌ మాత్రం అతడు ఫామ్‌లో ఉన్న లేక పోయినా ఎప్పడూ ఒకేలా ఉంటాడు. "సిరాజ్‌ ఆర్సీబీ జట్టులో తొలుత అంతగా రాణించలేదు.

కానీ అతడు తన పట్టుదలతో జట్టులో ఒక్కసారిగా స్టార్‌ బౌలర్‌గా మారిపోయాడు. ఇక భారత తరుపున అద్భుతమైన బౌలర్లలో సిరాజ్‌ ఒకడు. అయినప్పటకీ దురదృష్టవంతుడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే భారత తరుపున అంతగా అవకాశాలు అతడికి రావడం లేదు. ఎ‍క్కువగా సిరాజ్‌ బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ వంటి వారికి ఇంకా అవకాశాలు ఇస్తున్నారు.

అయితే కొంతమంది భారత పేసర్లు తమ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నారు. అనంతరం సిరాజ్‌ భారత పేస్‌ బౌలింగ్‌ విభాగాన్ని లీడ్‌ చేస్తాడని" హెస్సన్  పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు సిరాజ్‌ను రూ. 7 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. మార్చి 26 నుంచి ఐపీఎల్‌-2022 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోలకతా నైట్‌రైడెర్స్‌ తలపడనుంది.

చదవండి: IPL 2022 -Lucknow Super Giants : లక్నో సూపర్‌జెయింట్స్‌కు వరుస షాకులు.. మరో ప్లేయర్‌ దూరం!

మరిన్ని వార్తలు