T20 World Cup: భారత్‌లో వద్దు.. వేదిక మార్చండి: హస్సీ

20 May, 2021 07:46 IST|Sakshi

సిడ్నీ: ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వేదికను మార్చాలని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు బ్యాటిం గ్‌ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైక్‌ హస్సీ అభిప్రాయపడ్డాడు. భారత్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా యూఏఈలో టీ20 వరల్డ్‌ కప్‌ ఏర్పాటు చేయాలని హస్సీ కోరాడు. ఎనిమిది జట్లతో బయో బబుల్‌ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహించినా కరోనా కేసులు వచ్చాయని... 16 జట్లతో ప్రపంచకప్‌ను నిర్వహించడం కష్టసాధ్యమని హస్సీ వ్యాఖ్యానించాడు.

కాగా వివిధ జట్ల ఆటగాళ్లు, కోచ్‌లకు కరోనా సోకడంతో బీసీసీఐ, ఐపీఎల్‌-2021ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక హస్సీకి రెండుసార్లు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో క్వారంటైన్‌  అనంతరం మాల్దీవులు వెళ్లిన అతడు అక్కడి నుంచి దోహా మీదుగా స్వదేశం ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. ఇక కరోనా బారిన పడటం గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘కోవిడ్‌ సోకిన 10 రోజుల తర్వాత మళ్లీ టెస్టు చేయించుకుంటే పాజిటివ్‌ రావడంతో కాస్త భయం వేసింది.. కానీ బీసీసీఐ నాకు ధైర్యం చెప్పింది.  ప్రస్తుతానికి కోలుకున్నా గానీ శరీరం కాస్త బలహీనంగానే ఉంది. మళ్లీ సాధారణ స్థితికి  రావడానికి నాకు కొంచెం సమయం పట్టొచ్చు’’ అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ఆరోజు బస్సులో అతని పక్కనే కూర్చున్నా.. అందుకే

మరిన్ని వార్తలు