మళ్లీ బరిలోకి మైక్‌ టైసన్‌, ఎంట్రీ అప్పుడే!

24 Jul, 2020 10:12 IST|Sakshi

బాక్సింగ్‌ అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది మైక్‌ టైసన్‌. 20 ఏళ్ల వయసులోనే ట్రివర్‌ బెర్బిక్‌ను ఓడించి హెవీ వెయిట్‌ ఛాంపియన్‌ షిప్‌ను గెలుచుకొని రికార్డు సృష్టించాడు. బాక్సింగ్‌ చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నటైసన్‌ 2005లో రిటైర్డ్‌ అయ్యాడు. అయితే  మళ్లీ రింగ్‌లోకి దిగాలని మైక్‌టైసన్‌ భావిస్తున్నాడు. సెప్టెంబర్‌ 12న 4 డివిజన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ రాయ్‌జోన్స్‌ జూనియర్‌తో తలపడనున్నాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఒక మ్యూజిక్‌ ప్లాట్‌ఫాం ద్వారా టైసన్‌ పంచుకున్నాడు. తాను రిటర్న్‌ వస్తున్న సందర్భంగా చేసిన ఒక వీడియోను టైసన్‌ షేర్‌ చేశారు.

చదవండి: మహాబలుడు

ఈ వీడియోలో టైసన్‌ గెలుచుకున్న  డబ్య్లూబీఏ, డబ్య్లూబీసీ, ఐబీఎఫ్‌ టైటిల్స్‌ను చూపిస్తూ ఒక పవర్‌ పుల్‌ పంచుఇవ్వగానే హి ఈజ్‌ బ్యాక్‌ అనే మ్యూజిక్‌ వస్తుంది. తాను మే నుంచి ప్రాక్టీస్‌ ప్రారంభించానని, చారిటీకి ఫండ్స్‌ ఇవ్వడం కోసమే తాను మరోసారి రింగ్‌లోకి దిగుతున్నట్లు మైక్‌ టైసన్‌ పేర్కొన్నాడు. ఇక తన ప్రత్యర్థులు తనతో తలబడటానికి సిద్దంగా ఉండాలని సవాల్‌ విసిరాడు. టైస‌న్ త‌న కెరీర్‌లో మొత్తం 50 ప్రొఫెష‌న‌ల్ ఫైట్స్‌ను గెలిచాడు. మొత్తానికి టైసన్‌ తిరిగి రావడంతో  బాక్సింగ్‌  అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

చదవండి: ప్రదీప్‌... కొత్త రకం డోపీ

Visit MyYellowShirt.com to buy your official @tysonranchofficial training gear and help support a good cause. @smartcups @miketysoncares

A post shared by Mike Tyson (@miketyson) on

మరిన్ని వార్తలు